Snakes: చలికాలం పాములు కనిపించకుండా ఎక్కడికి వెళ్తాయి? వాటి అడ్రస్‌ ఎక్కడో తెలుసా?

Snakes Not Seen In Winter: పాము బుస్సుమంటేనే ఆమడ దూరం పారిపోతాం. వెనక్కి తిరిగి చూడకుండా కిలోమీటరు పరుగెత్తుతాం. ఎందుకంటే పాములు విషపూరిత జంతువుల్లో ఒకటి. కరిస్తే ప్రాణాలు హరి. చెట్లు పుట్టలు, పొదలు, ఇల్లు అనే సంబంధం లేకుండా ఎక్కడంటే అక్కడ కనిపిస్తాయి. ఈ మధ్యకాలంలో ట్రైన్ లో కూడా పాముల దర్శనం ఇస్తున్నాయి. అయితే చలికాలం పాములు ఎందుకు కనిపించవు ఆ రహస్యం మీకు తెలుసా?
 

1 /7

చలికాలం పాములు ఎక్కువగా కనిపించవు. ఈ విషయం మీకు తెలుసా? మరి ఎక్కడికి వెళతాయి? ఏంచేస్తాయి?  చలికాలంలో పాములు ఎక్కువగా నిద్రకు పోతాయి. తిరిగి ఎండాకాలంలో వేటడానికి వాటికి తగిన శక్తి ఈ సీజన్లోనే దొరుకుతుంది. అందుకే అవి బాగా నిద్రపోతాయి.  

2 /7

ముందుగానే వాటి శరీరంలో నిల్వ చేసిన కొవ్వులను కూడా ఈ సమయంలో ఉపయోగించుకుంటాయి. దీంతో వాటికి ఆకలి వేయదు. బయటకు వేటాడటానికి రావాల్సిన పనిలేదు. అందుకే ఈ సమయంలో వేటకు కూడా వెళ్లవు.  

3 /7

చలికాలంలో అవి బయటకు కనిపించకుండా దాక్కుంటాయి. వాటి శరీరం వెచ్చగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాయి. వర్షాకాలంలో అడవుల్లో నుంచి సైతం బయటకు వచ్చే పాములు చలికాలంలో మాత్రం చెట్లు, పుట్టలో దాక్కుంటాయి. ఈ సమయంలో వాటికి కావలసిన శక్తి కూడా పెంచుకుంటాయట .  

4 /7

అయితే, అడవుల్లో కూడా ఎక్కువగా ఉండవు. ఎందుకంటే అడవుల్లో కూడా చలి ఎక్కువగా ఉంటుంది.. వేటాడే జంతువులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అవి రాళ్ల మధ్యలోపలికి వెళ్లిపోతాయి. అక్కడే వాటి ప్రాణానికి కూడా ఏ హాని ఉండదు.  

5 /7

ముఖ్యంగా ఈ చలికాలంలో వాటి కార్యకలాపాలు మందగిస్తాయి. అందుకే అవి సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లిపోతాయి. అక్కడ నిద్రా స్థితిలో గాఢ నిద్రలోకి వెళ్తాయి. అప్పుడప్పుడు సూర్యరశ్మి కోసం బయటికి వస్తూ వెళ్తూ ఉంటాయి.  

6 /7

ముఖ్యంగా భూమి లోపల, రాళ్ల కింద, చెట్లు ఉండే పగుళ్ల మధ్యలో లోపటికి వెళ్లి నిద్రాణ స్థితికి వెళ్ళిపోతాయి. అక్కడ చలి కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి అవి నిద్రపోవడానికి అనువైన స్థలం.  

7 /7

చలికాలంలో కనిపించక పోకుండా పోయే పాములు మళ్ళీ వేసవికాలం సమయం నాటికి ఎక్కువ శక్తితో పుంజుకుంటాయి వేటకు బయలుదేరుతాయి. చలికాలం మాత్రం కాస్త విరామం తీసుకుంటాయి. ఒక విధంగా ఇవి కూడా వేటకు బ్రేక్‌ తీసుకుంటాయి.