Gold Rate: పసిడి ప్రియులకు పండగలాంటి వార్త..తులం బంగారం రూ. 60 వేలకు దిగి వస్తుందా..?

Gold: పసిడి  ప్రియులకు ఇది పండగలాంటి వార్త. ఎందుకంటే బంగారం ధర భారీగా తగ్గుతోంది. మొన్నటివరకు కొండెక్కి కూర్చొన్న ధర ఇప్పుడు నేలచూపు చూస్తుంది. దీంతో చాలా మంది బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే రానున్న కాలంలో బంగారం ధర రూ. 60వేలకు చేరుకునే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. నిజంగా బంగారం ధర రూ. 60వేలకు దిగువన వస్తుందా? తెలుసుకుందాం. 
 

1 /5

Gold Rate : ఈ సంవత్సరం బడ్జెట్లో విలువైన లోహాలపై కస్టమ్స్ సుంకం భారీగా తగ్గించడంతో బంగారం ధరలు అమాంతం దిగి వస్తున్నాయి. ప్రస్తుతం బంగారం ధర 24 క్యారెట్లు 10 గ్రాములకు గాను 69000 పలుకుతోంది.  మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64000 సమీపంలో ట్రేడ్ అవుతోంది. బంగారం ర భారీగా తగ్గుతుండటంతో పసిడి ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాబోయే శ్రావణమాసం. ఈ సమయంలో బంగారం ధరలు భారీగా తగ్గుతుండటంతో..పెద్ద ఎత్తున ఆభరణాలు కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తారని నగల వ్యాపారుల సైతం ఆశిస్తున్నారు.  

2 /5

పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో గమనించినట్లయితే బంగారం ధరలు దాదాపు రెండు రెట్లు పెరిగాయి. 2019 వ సంవత్సరంలో బంగారం ధర కేవలం 37వేల రూపాయల వద్ద మాత్రమే ఉంది. కానీ 2024వ సంవత్సరానికల్లా బంగారం ధర రూ. 75 వేల సమీపానికి చేరింది.అంటే గడిచిన ఐదేండ్లకాలంలో బంగారం ధర దాదాపు రెట్టింపు అయ్యింది.   

3 /5

బంగారం ధర ఈ రేంజ్ లో రికార్డు స్థాయిలో పెరగటం చరిత్రలో ఇదే మొదటిసారి అని నిపుణులు పేర్కొంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో బంగారం సహా ఇతర విలువైన లోహాల దిగుమతి సుఖంపై భారీగా తగ్గింపు ప్రకటించడంతో బంగారం వెండి ప్లాటినం వంటి లోహాల ధరలు దిగి వస్తున్నాయి.  

4 /5

బంగారం ధరలు తగ్గడం వల్ల పెద్ద ఎత్తున  కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. తద్వారా నగల వ్యాపారులకు వ్యాపారం కూడా విస్తరిస్తుంది. దీనికి తోడు శ్రావణమాసంలో వివాహాది శుభకార్యాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. శ్రావణమాసం అనంతరం భాద్రపదం ఆశ్వీయుజ మాసాల్లో అనేక పండగలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బంగారు నగల వ్యాపారం పెద్ద ఎత్తున కొనసాగే అవకాశం ఉందని.. పసిడి ఆభరణాల వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.   

5 /5

మరోవైపు అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు తగ్గివస్తే మాత్రం, ప్రస్తుతం ఉన్న రేంజ్ నుంచి పసిడి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని కూడా బులియన్ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ట్రెండ్ గనుక కొనసాగినట్లయితే బంగారం ధరలు రూ. 65 వేల కన్నా తక్కువ చేరే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.