WPL Mini Auction 2025: WPL చరిత్రలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీళ్లే.. ఓ లుక్కేయండి

Most Expensive Players In WPL: ఐపీఎల్ మెగా వేలం ఉత్కంఠ జరగ్గా.. నేడు మరో వేలానికి రంగం సిద్ధమైంది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) మినీ వేలం ఆదివారం నిర్వహించనున్నారు. బెంగళూరులో మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభం కానుంది. వేలంలో 120 మంది క్రికెటర్లు ఉండగా.. అందులో భారత్ నుంచి 92 మంది ఉన్నారు. మొత్తం 5 జట్లలో 19 స్లాట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. వేలంలో హీథర్ నైట్, లీ తహుహూ, డియోండ్ర డాటిన్, స్నేహ్ రాణా, పూనమ్ యాదవ్, వేద కృష్ణమూర్తి వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. WPL చరిత్రలో అత్యంత ఖరీదైన ప్లేయర్లపై ఓ లుక్కేయండి.
 

1 /8

స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన WPL చరిత్రలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌గా ఉన్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆమెకు రూ.3.4 కోట్లు ఆఫర్ చేసింది.  

2 /8

ఆసీస్ స్టార్ ప్లేయర్ ఆష్లీ గార్డనర్‌ను గుజరాత్ జెయింట్స్‌ రూ.3.20 కోట్లకు కొనుగోలు చేసింది.  

3 /8

ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ నటాలీ రూత్ స్కివర్ బ్రంట్‌ కోసం ముంబై ఇండియన్స్ రూ.3.20 కోట్లు ఖర్చు చేసింది.  

4 /8

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మను యూపీ వారియర్స్ ఫ్రాంచైజీకి రూ.2.60 కోట్లకు దక్కించుకుంది.  

5 /8

స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్‌ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2.20 కోట్లు వెచ్చించింది.  

6 /8

ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ బెత్ మూనీని గుజరాత్ జెయింట్స్  రూ.2 కోట్లకు కొనుగోల చేసింది.   

7 /8

ఓపెనర్ షఫాలీ వర్మను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2.00 కోట్లకు తీసుకుంది.   

8 /8

భారత స్టార్ ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్‌ రూ.1.9 కోట్లకు ముంబై ఇండియన్స్ అమ్ముడుపోయారు.