అలాగే ఈ సిరీస్‌లో కంపెనీ ఎంతో శక్తివంతమైన 6.36 అంగుళాల LTPO AMOLED డిస్ల్పేను అందిచబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ వరకు సపోర్ట్ చేస్తుంది.
ఇక ఈ మొబైల్స్‌కి సంబంధించిన బ్యాటరీలో వివరాల్లోకి వెళితే..కంపెనీ ఇందులో 4,610 mAh బ్యాటరీ, 90W వైర్డ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ మద్ధతుతో అందించబోతోంది.
మార్కెట్లోకి ఈ మొబైల్స్ విడుదలైతే ప్రారంభ ధర రూ.56,800 ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం. గతంలో విడుదల చేసిన 13 Ultra స్మార్ట్‌ఫోన్ ధర రూ. 1.3 లక్షలుగా ఉంది.
ఈ Xiaomi 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ గతంలో చైనాలో విడుదల చేసిన Xiaomi 13 సిరీస్‌ను పోలి ఉంటాయని పలువురు టిప్‌స్టర్స్ తెలుపుతున్నారు.
షియోమీ ఈ మూడు మొబైల్స్‌ను HyperOS యూజర్ ఇంటర్ఫేస్తో వినియోగదారులకు అందించేందుకు యోచిస్తోంది.
షియోమీ కంపెనీ ఈ Xiaomi 14, 14 Ultra, 14 Pro మూడు వేరియంట్స్‌ను ప్రీమియం ఫీచర్స్‌తోనే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. దీంతో పాటు ఈ మొబైల్స్ 12GB ర్యామ్, 1TB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఆప్షన్‌తో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.
షియోమీ మార్కెట్‌కి అల్ట్రా వేరియంట్‌ను లాంచ్ చేస్తే..ఇది ఐఫోన్ 14 ప్రో మాక్స్‌తో పోటీ పడే అవకాశాలు ఉన్నాయని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
త్వరలోనే ప్రపంచ మార్కెట్లోకి ప్రముఖ టెక్ కంపెనీ షియోమీ మరో మూడు ప్రీమియం సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేయబోతోంది. ఫిబ్రవరి 25న జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) ఇవెంట్లో భాగంగా ఈ Xiaomi 14, 14 Ultra, 14 Pro స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అయితే లాంచింగ్‌కి ముందే ఈ మొబైల్‌కి సంబంధించి ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Authored By:
Dharmaraju Dhurishetty
Publish Later:
No
Publish At:
Friday, February 16, 2024 - 16:57
Mobile Title:
Apple 15 మించిన ఫీచర్స్‌తో మార్కెట్లోకి Xiaomi 14 సిరీస్..ఫీచర్స్, ధర వివరాలు ఇవే
Created By:
Cons. Dhurishetty Dharmaraju
Published By:
Cons. Dhurishetty Dharmaraju
Request Count:
18
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.