Python Sleeps in Lap of Girl: వణుకు పుట్టిస్తున్న వీడియో.. చిన్నారి ఒళ్లో 20 అడుగుల భారీ కొండచిలువ

సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి.. కొన్ని వీడియోలు నవ్వులు పూయిస్తుంటే.. మరి కొన్ని వీడియోలు భయాన్ని గురికి చేస్తుంటాయి.. ఇపుడు మీరు చూడబోయే వీడియో వణుకు పుట్టించేదే.. ఓ లుక్కేయండి మరీ!

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 1, 2021, 01:58 PM IST
  • చిన్నారి ఒళ్లో 20 అడుగుల భారీ కొండచిలువ
  • వీడియో చూసి నివ్వెరపోతున్న నెటిజన్లు
  • కోట్లలో వీక్షణ... లక్షల్లో కామెంట్స్
  • వీడియో చూస్తే భయపడటం కాయం!
Python Sleeps in Lap of Girl: వణుకు పుట్టిస్తున్న వీడియో.. చిన్నారి ఒళ్లో 20 అడుగుల భారీ కొండచిలువ

 Python sleeps in lap of Girl: మాములుగా చిన్న చిన్న పాములను చూస్తేనే భయంతో వణికిపోతుంటాము కదా..! మరి కొంత మంది పాములను చూస్తేనే చిరాకు కలుగుతుంది. అలాంటిది 20 అడుగుల భారీ కొండా చిలువ (Python) ఒళ్లో పాకితే.. ?? ఉహించటానికే భయంగా ఉన్న ఈ వీడియో చూస్తే మీరే హవాక్కవుతారు. 

సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి.. కొన్ని వీడియోలు ఫన్నీ గా ఉంటే, కొన్ని వీడియోలు భయానికి గురి చేస్తే, మరి కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. వైరల్ అయ్యే వీడియోలు ప్రపంచం లో ఎక్కడ జరిగాయని కాకుండా వీడియోలో ఉన్న వింతకు మాత్రమే జనాలు ఆకర్షితులవుతుంటారు. 

Also Read: AP ICET 2021, AP ECET 2021 results: ఏపీ ఐసెట్ 2021, ఏపీ ఈసెట్ ఫలితాలు వెల్లడి.. sche.ap.gov.in లో ర్యాంక్ కార్డులు

ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video in Social Media) గా మారింది, అదేంటంటే 20 అడుగులు ఒక భారీ కొండచిలువ చిన్న పాప ఒళ్లో సేదతీరటం. ఈ  వీడియోలో ఆ పాప ఫోన్ తో యధావిధిగా ఎదో చూస్తుంది.. ఆ కొండా చిలువ ఆ పాప  ఒళ్లో తల పెట్టి పడుకోవటం మనం చూడవచ్చు. కొంత మందికి ఇది ఫేక్  గా అనిపించిన కొండచిలువ కదులుతున్న దృశ్యాలు చూసి ఇది నిజం అని తెలుస్తుంది. 

ఒక చేతిలో ఫోన్ పట్టుకొని, మరో చేత్తో పామును నిమరడం, పాము నెమ్మదిగా కదలటం....  ఈ వీడియోను చూసిన  నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అసలు ఇది నిజమా?? లేక కల్పితమా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తుంటే.. మరి కొందరు వీడియో చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుందని కామెంట్ చేస్తున్నారు. మరీ ఇంత భయంకరంగా ఉన్న వీడియోని మీరే చూడండి. 

Aslo Read: Funny Dance Video: ఆఫ్రికన్ వధువు- ఇండియన్ వరుడు.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వీడియో

'యువర్ నేచర్‌గ్రామ్' (yournaturegram) అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఈ వీడియో పోస్ట్ చేయగా... 1.3 మిలియన్లకు పైగా నెటిజన్లు వీక్షించగా వేలాది మంది యూసర్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News