Wedding: ''ఇదేంది భయ్యా ".. పెళ్లి కూతుళ్లంతా తమకు తామే దండలు వేసుకున్నారు... వైరల్ గా మారిన ఘటన..

Uttar Pradesh: వధువు,వరులు పెళ్లి చేసుకుంటున్నట్లు ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆతర్వాత కొందరు అమ్మాయిలు అచ్చం పెళ్లికూతురులా కాస్టూమ్ వేసుకున్నారు. తమమెడలో తామే పూల దండలు వేసుకున్నారు. 

Written by - Inamdar Paresh | Last Updated : Feb 1, 2024, 02:58 PM IST
  • - పెళ్లి వేడుకలో బిగ్ ట్విస్ట్..
    - తమకు తామే దండలు వేసుకున్న అమ్మాయిలు
    - సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఘటన
Wedding: ''ఇదేంది భయ్యా ".. పెళ్లి కూతుళ్లంతా తమకు తామే దండలు వేసుకున్నారు... వైరల్ గా మారిన ఘటన..

Fraud For Community Wedding Scheme: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల పెళ్లిళ్ల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాలలో పెళ్లి చేసుకున్న పథకంకు అర్హులైన వారికి,  కొందరు నగదు రూపంలో ఇస్తుంటే, మరికొన్ని చోట్ల బంగారం కూడా ఇస్తున్నారు.

అయితే.. ఇదే అదునుగా భావించి కొందరు సర్కారు సొమ్మును అక్రమంగా కాజేసేందుకు ప్లాన్ లు వేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని చోట్ల యువతీ, యువకులు దళారులతో కుమ్మక్కై పెళ్లి చేసుకున్నట్లు ఫోటోలు దిగి ఆతర్వాత డబ్బులు రాగానే పంచేసుకుని ఎవరిదారిన వారి వెళ్లిపోతున్నారు. అచ్చం ఇలాంటి ఘటన నెట్టింట వైరల్ గా మారింది. 

పూర్తి వివరాలు..

ఉత్తర ప్రదేశ్ లో జరిగిన సాముహిక వివాహలు ప్రస్తుతం తీవ్ర వివాదస్పదంగా మారాయి.  కమ్యూనిటీ వెడ్డింగ్ స్కీమ్‌కు సంబంధించి బల్లియాలో జరిగిన ఒక కుంభకోణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. పోలీసుల ప్రకారం.. జనవరి 25న జరిగిన కమ్యూనిటీ వెడ్డింగ్ కార్యక్రమం జరిగింది. దీనిలో అనేక జంటలు పెళ్లి చేసుకొవడానికి వచ్చారు. అయితే.. ఎక్కువ మంది అమ్మాయిలు అచ్చం పెళ్లికూతురు కాస్టూమ్స్ లలో రెడీ అయి వచ్చారు. ఈ వేడుక చూడటానికి ఎంతో మంది  యువకులు అక్కడికి వెళ్లారు.

ఈ క్రమంలోనే.. బల్లియా నివాసి బబ్లూ కూడా కమ్యూనిటీ పెళ్లిళ్లు చూడటానికి వెళ్లాడు. అయితే.. అక్కడున్న వారు కొందరు పెళ్లికొడుకు వేషం ఆఫర్ ఇచ్చాడని తెలిపాడు. దీని కోసం తనకు రూ.2,000 నుంచి 3,000 ఇచ్చారని కూడా తెలిపాడు. అక్కడున్న కొందరు.. ప్రోగ్రాం కో-ఆర్డినేటర్లు వేరే మగవాళ్లను కూడా పెళ్లికొడుకులా తయారు చేశారని అన్నారు.

ఇదిలా ఉండగా.. కొందరు మహిళలు తమకు తామే మెడలో పూల మాల వేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, దీనిపై బల్లియా జిల్లా మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ స్పందించారు. ఇప్పటి వరకు లబ్ధిదారులకు కేటాయించిన పథకం డబ్బులు ఇవ్వలేదన్నారు. 

Read Also: Snakes: ఈ చెట్లంటే పాములకు హడల్.. ఇవి ఉన్న చోట అస్సలు కన్పించవు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News