Diet Coke, Sugar Free Drinks: అలాంటి డ్రింక్స్ తాగితే క్యాన్సర్ వస్తోందా ?

Diet Coke, Sugar Free Drinks Side Effects: కొకాకోలాలో డైట్ కోక్ అంటే లో కేలరీ ఆప్షన్ అనే అభిప్రాయం ఉంది. శాస్త్రీయంగా డైట్ కోక్‌లో యాడెడ్ షుగర్ ఉండదు. అందుకే షుగర్ ఫ్రీ కంటెంట్ ఉండే డ్రింక్స్ ప్రిఫర్ చేసే వారు డైట్ కోక్‌ని ఎంపిక చేసుకుంటారు. డైట్ కోక్ మాత్రమే కాదు.. షుగర్ ఫ్రీ డ్రింక్స్‌ని ఏరికోరి మరీ ఇష్టంగా తాగే వారు కూడా చాలా మందే ఉన్నారు.

Written by - Pavan | Last Updated : Jul 17, 2023, 06:25 PM IST
Diet Coke, Sugar Free Drinks: అలాంటి డ్రింక్స్ తాగితే క్యాన్సర్ వస్తోందా ?

Diet Coke, Sugar Free Drinks Side Effects: కొకాకోలాలో డైట్ కోక్ అంటే లో కేలరీ ఆప్షన్ అనే అభిప్రాయం ఉంది. శాస్త్రీయంగా డైట్ కోక్‌లో యాడెడ్ షుగర్ ఉండదు. అందుకే షుగర్ ఫ్రీ కంటెంట్ ఉండే డ్రింక్స్ ప్రిఫర్ చేసే వారు డైట్ కోక్‌ని ఎంపిక చేసుకుంటారు. డైట్ కోక్ మాత్రమే కాదు.. షుగర్ ఫ్రీ డ్రింక్స్‌ని ఏరికోరి మరీ ఇష్టంగా తాగే వారు కూడా చాలా మందే ఉన్నారు. కానీ డైట్ కోక్‌తో పాటు అన్ని షుగర్ ఫ్రీ డ్రింక్స్ కూడా ఆరోగ్యానికి యమ డేంజర్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చిచెప్పేసింది. అవును.. డైట్ కోక్‌తో పాటు అన్ని షుగర్ ఫ్రీ డ్రింక్స్ తయారీలో అస్పర్టేమ్ అనే కృత్రిమ షుగర్ మిశ్రమాన్ని ఉపయోగిస్తున్నారు.

అయితే, ఈ అస్పర్టేమ్ క్యాన్సర్ కారకం అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనుబంధ విభాగం అయిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రిసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) స్పష్టంచేసింది. క్యాన్సర్‌పై పరిశోధనలు చేసే ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రిసెర్చ్ ఆన్ క్యాన్సర్ తాజా పరిశోధనల్లో ఈ భయంకరమైన చేదు నిజం వెలుగుచూసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రిసెర్చ్ ఆన్ క్యాన్సర్ సంస్థ ప్రతినిధులు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్‌కి వెల్లడించినట్టు సమాచారం అందుతోంది. 

వాస్తవానికి డయాబెటిస్ పేషెంట్స్ ఎక్కువగా షుగర్ ఫ్రీ డ్రింక్స్ సేవిస్తుంటారు. అవి తాగడం వల్ల తమ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయనే నమ్మకం డయాబెటిస్ పేషెంట్స్‌ది. అందుకే కూల్ డ్రింక్స్ తాగాలనిపించినప్పుడు షుగర్ ఫ్రీ డ్రింక్స్‌ని ఎంపిక చేసుకుంటారు. కానీ అవి తాగడం వల్ల షుగర్ లెవెల్స్ పెరగకపోవచ్చునేమో కానీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది అంటే డయాబెటిస్ పేషెంట్స్ అవి టచ్ చేసే ధైర్యం చేస్తారా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. 

డయాబెటిస్ పేషెంట్స్ మాత్రమే కాదు.. డయాబెటిస్ రాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ డైట్ కోక్ వంటి షుగర్ ఫ్రీ డ్రింక్స్ సేవించే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. ఇప్పుడు వాళ్ల ఆరోగ్యం కూడా ప్రమాదం అంచులో ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలావుంటే, ఎంత పరిమితి వరకు అస్పర్టేమ్ వినియోగం శరీరానికి హానీ చేయకపోవచ్చు అనే వివరాలను వెల్లడించని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రిసెర్చ్ ఆన్ క్యాన్సర్.. మితిమీరిన వినియోగంపై మాత్రం హెచ్చరికలు జారీచేసింది. ఏదేమైనా తాము ఆరోగ్యం కోసం తీసుకునే షుగర్ ఫ్రీ డ్రింక్స్ లో ఉండే ఈ అస్పర్టేమ్ శరీరానికి మరీ ఇంత హానీ చేస్తుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Trending News