Iphone Users: ఐ ఫోన్‌ యూజర్లకు బిగ్‌ షాక్.! అక్టోబర్ 24 తర్వాత ఆ మోడల్‌ వాళ్లకు వాట్సాప్‌లో ఆ ఫీచర్లు పని చేయవు.!!

Iphone Users:ప్రతి స్మార్‌ఫోన్‌ వినియోగదారునికి ఫోన్‌ సరికొత్త అప్‌డేట్‌లు ఎంతో అవసరం. ఈ  అప్‌డేట్‌ల ద్వారా ఫోన్‌లో ఫీచర్లు మరింత మెరుగుపడే అవకాశాలుంటాయి

Written by - ZH Telugu Desk | Last Updated : May 23, 2022, 09:37 AM IST
  • ఐఫోన్‌యూజర్లకు బిగ్‌ షాక్.
  • అక్టోబర్ 24 తర్వాత వాట్సాప్‌లో ఆ ఫీచర్లు పని చేయవు
  • ఈ అంశాన్ని వెల్లడించిన WABetaInfo
Iphone Users: ఐ ఫోన్‌ యూజర్లకు బిగ్‌ షాక్.! అక్టోబర్ 24 తర్వాత ఆ మోడల్‌ వాళ్లకు వాట్సాప్‌లో ఆ ఫీచర్లు పని చేయవు.!!

Iphone Users:ప్రతి స్మార్‌ఫోన్‌ వినియోగదారునికి ఫోన్‌ సరికొత్త అప్‌డేట్‌లు ఎంతో అవసరం. ఈ  అప్‌డేట్‌ల ద్వారా ఫోన్‌లో ఫీచర్లు మరింత మెరుగుపడే అవకాశాలుంటాయి. మొబైయిల్‌ వినియోగదారులు అప్‌డేట్ చేయడానికి స్మార్‌ఫోన్‌  కంపెనీలు వివిధ రకాల అప్‌డేట్‌లను అందిస్తాయి. ఈ అప్‌డేట్‌లు వివిధ రకాల మాల్వేర్స్‌ నుంచి రక్షిస్తాయి. అయితే ఈ మధ్య వాట్సాప్‌(WhatsApp) ఐఫోన్‌ వినియోగదారులను ఉద్దేశించి ఓ ప్రకటన చేసింది. త్వరలో కొంతమంది iOS వినియోగదారులకు వాట్సాప్‌లో ఉండే వివిధ రకాల ఫీచర్ల పనిచేయవని పేర్కొంది     ప్రముఖ టెక్‌ దిగ్గజం. ముఖ్యంగా iOS 10, iOS 11, iPhone5C, iPhone5లో పలు రకాల ఫీచర్లను ఉపసంహరించుకుంటునట్లు తెలిపింది.

మరి కొన్ని యాప్‌ల ఫీచర్లు కూడా..!!:

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్(Instant messaging app) ఈ అప్‌డేట్‌ను విడుదల చేసిన తర్వాత..ఇక ఆ యూజర్లకు అనేక యాప్‌లోని ఫీచర్లు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండకపోవచ్చని టెక్ నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతానికి ఈ మార్పు వల్ల ఏ ఫీచర్లు ప్రభావితం అవుతాయనే దానిపై అధికారిక ప్రకటన లేదు.

ఈ మోడల్స్‌లో వాట్సాప్ పనిచేయదు:

రాబోయే నెలల్లో iOS 10, iOS 11, iPhone 5, iPhone 5Cలలో వాట్సాప్ సంబంధించి పలు ఫీచర్లు పనిచేయవు. వాట్సాప్‌ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగానే ఈ మార్పులు తీసుకువచ్చినట్లు వాట్సాప్ పేర్కొంది. అంతేకాకుండా  భద్రతలు, గోప్యతల కారణంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు పలు వార్త సంస్థలలో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ ఫోన్‌లలో  పాత వెర్షన్‌ వాట్సాప్ పని చేస్తాయని సంస్థ తెలిపింది.

WABetaInfo అందించిన సమాచారం:

వాట్సాప్‌లో వచ్చే వివిధ అప్‌డేట్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న iPhone వినియోగదారులకు అందుబాటులో ఉండకపోవచ్చని WABetaInfo వెల్లడించింది. వాబీటాఇన్ఫా (WABetaInfo ) తెలిపిన వివరాల ప్రకారం.. ఇన్‌స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ అక్టోబర్ 24 తర్వాత పైన పేర్కొన్న ఐఫోన్‌లలో ఫీచర్లు పనిచేయవని పేర్కొంది. అయితే iOS 10, iOS 11లలో వాట్సాప్‌(WhatsApp) అప్‌డేట్ ఇచ్చిన తర్వాత iOS 10, iOS 11, iPhone5C, iPhone5లో పలు ఫీచర్లు పని చేయవని తెలిపింది.

 

AlAo Read: Petrol, Diesel Price Today: వ్యాట్ తగ్గిస్తున్న రాష్ట్రప్రభుత్వాలు.. పెట్రోల్-డీజిల్ ధరలు ఏ నగరంలో ఎంత..?

Also Read: Viral Video: రైలెక్కిన ఆర్టీసీ బస్సులు.. ప్రయాణికులు షాక్! వైరల్ వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News