Kacha Badam: ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న బెంగాలి పాట 'కచ్చా బాదామ్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెలెబ్రెటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా ఈ సాంగ్‌కు డ్యాన్సులు చేస్తూ.. సమాజిక మాధ్యమాల్లో తమ వీడియోలను పెడుతున్నారు లక్షలాది మంది.
ఇక సోషల్ మీడియాలో తమ వీడియోలను పెట్టకపోయినా.. మిలియన్ల మంది ఈ సాంగ్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
పాటకు మూలం..
ఇంటర్నెట్లో ఇప్పడు తెగ ట్రెండ్ అవుతున్న ఈ క్యాచీ జింగిల్‌ను పాడిన వ్యక్తి పేరు బూబన్ బద్యాకర్. పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన ఆయన ఓ చిరు వ్యాపారి. గ్రామాల్లో సైకిల్‌పై తిరుగుతూ పల్లీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు.
పల్లీలు కొనేలా జనాలను ఆకర్షించేందుకు ఇలా సొంతంగా తానే లిరిక్స్ రాసుకుని పాడారు. తన వ్యాపారాన్ని పెంచుకునేందుకు చేసిన ఈ ప్రయత్నం ఏకంగా ఇంటర్నెట్ సెన్షేషన్‌గా మారింది.
ఆయన పాడిన కచ్చా బాదమ్ పాటను కొంత మంది సోషల్ మీడియాలో పెట్టారు. దీనితో అది కాస్త వైరల్ అవడంతో ఆయనకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.
అంతేనా.. అదే పాటను ఓ యూట్యూబ్ ఛానెల్ వాళ్లు ఆయననే పెట్టి రీ మిక్స్ చేశారు. దీనితో బూబన్ బద్యాకర్ ఇప్పుడు సెలెబ్రెటీ అయిపోయారు. బూబన్ బద్యాకర్ ప్రతిభను గుర్తించి ఇటీవలే బెంగాల్ పోలీసులు కూడా ఆయనను సత్కరించడం విశేషం.
ఇంత జరిగినా ఆయన ఆర్థిక స్తితి మాత్రం ఏం మారలేదు. ఈ విషయంపై నెట్టజన్లు.. అసలు ఆయన పాటను క్రెడిట్‌ను వాడుకున్నా ఎందుకు ఆర్థిక స్థితి ఇంకా అలానే ఉంది అని ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బూబన్ బద్యాకర్తో పాటను రీమిక్స్ చేసిన Godhuli Bela Music స్పందించింది. ఆయనతో పాటకోసం రూ.3 లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలిపింది. నేడు (శుక్రవారం) రూ.1.5 లక్షల చెక్ అందించినట్లు తెలిపింది. మిగతా మొత్తాన్ని వచ్చే వారం చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది.
ఇక బూబన్ బద్యాకర్తో పాడించి, రీమక్స్ చేసిన సాంగ్‌కు యూట్యూబ్‌లో దాదాపు 7 కోట్ల వ్యూస్ వచ్చాయి.
Also read: Viral Video: పెళ్లి కూతురు ముస్తాబు చూసి నోరెళ్లబెట్టిన పెళ్లి కొడుకు!
Also read: Viral Video: ఈ ఛాన్స్ పోతే మళ్లీ రాదన్నట్టు స్టెప్పేసిన నవ వధువు.. చూస్తే షాకే!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook