Monkey Vs Leopard: చెట్టుపై చిరుతను ఓ ఆటాడుకున్న కోతి.. ఫన్నీ వైరల్​ వీడియో!

Monkey Leopard Funny video: ఎక్కడైనా పులి వెంటపడితే.. దాని దరిదాపులో కూడా ఉండకుండా పారిపోయిన కోతులను చూసి ఉంటారు. కానీ ఓ కోతి మాత్రం చిరుతకే చుక్కలు చూపింది. ఆ వైరల్ వీడియో చూద్దామా?

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 1, 2022, 05:26 PM IST
  • చిరుతకు చుక్కలు చూయించిన కోతి
  • చెట్టుపై జంప్ చేస్తూ చిరుతకు తిప్పలు..
  • ఇంటర్నెట్​లో వైరల్ అవుతున్న వీడియో
Monkey Vs Leopard: చెట్టుపై చిరుతను ఓ ఆటాడుకున్న కోతి..  ఫన్నీ వైరల్​ వీడియో!

Monkey Leopard Funny video: ఇంటర్నెట్​లో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో జంతువుల వీడియోలుల కూడా అనేకం ఉంటాయి. రెండు జంతువులు ఫన్నీగా పోట్లాడుకోవడం, ఒకే జంతువు కూడా ఫన్నీ వీడియోలు ఇంటర్నెట్​లో తెగ వైరల్ అవుతుంటాయి.

అలాంటి ఫన్నీ వీడియోల సరసన కొత్త వీడియో వచ్చి చేరింది. ఓ కోతి, చిరుత మధ్య సన్నివేశం ఇప్పుడు ట్రెండ్​ అవుతోంది.

సాధారణంగా కోతికి చెట్లు ఎక్కడం అత్యంత సులభమైన విద్య, ఒక కొమ్మ నుంచి మరో కొమ్మపైకి సునాయాసంగా జంప్ చేస్తుంది. అయితే చిరుత కూడా చెట్టు ఎక్కగలదని అందరికీ తెలుసు. కానీ కోతిలా చెట్లపై జంప్ మాత్రం చేయలేదు.

అయితే ఈ రెండింటి మధ్య ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. చెట్టుపై ఉన్న కోతిని చూసిన చిరుత.. అది కూడా చెట్టెక్కింది. ఇది గమనించిన కోతి చెట్టు చిటారు కొమ్మపైకి ఎక్కింది. చిరు ఆ చిటారు కొమ్మపైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా.. అక్కడి నుంచి మరో కొమ్మపైకి దూకింది కోతి, చిరుత మళ్లీ ఆ కొమ్మపైకి ఎక్కేందుకు ట్రై చేయగా.. ఆ కోతి మళ్లి ముందున్న కొమ్మపైకి దూకింది.

కోతి వేగంగా ఒ కొమ్మ, ఈ కొమ్మ మధ్య పైకి జంప్ చేస్తుండగా.. దానిని పట్టుకోలేక తిప్పలు పడింది. చివరకు దానిని పట్టుకోలేక అలసిపోయి అలానే చెట్టుపై కూర్చుంది. ఇక ఇది చూసిన నెటిజన్లు కోతితో మామూలుగా ఉండదని.. చిరుతోనే అడుకున్న కోతి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వీడియోను రోర్​ వైడ్లీ అని యూట్యూబ్ ఛానెల్ షేర్ చేసింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 5.16 లక్షల మంది లైక్ చేశారు.

Also read: Live Accident: డివైడర్​ను ఢీ కొని పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ లైవ్​ వీడియో!

Also read: Viral Video: కోపిష్టి జంట... ఇంత కోపమైతే ఇక కాపురమెలా చేస్తారో.. వీడియో వైరల్..

థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News