Viral Video: వామ్మో.. లైవ్ లో భార్యపై పళ్లు కొరికి, కొట్టడానికి ప్రయత్నం చేసిన క్రికెట్ ఎక్స్ పర్ట్.... వైరల్ వీడియో..

Pakistan: పాకిస్థాన్ క్రికెట్ ఎక్స్ పర్ట్   మొహ్సిన్ అలీ లైవ్ లో ప్రవర్తించిన తీరు వైరల్ గా మారింది. ఆయనకు 'ఆప్ కా మొహ్సిన్ అలీ'  అనే ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానెల్ ఉంది. దీనికి 100k కంటే ఎక్కువగా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన లైన్ లో మాట్లాడుండగా... తన భార్య పట్ల దురుసుగా ప్రవర్తించారు. 

Written by - Inamdar Paresh | Last Updated : Feb 18, 2024, 01:20 PM IST
  • - లైవ్ భార్యను కొట్టడానికి ప్రయత్నించిన యూట్యూబర్..
    - ఇదేం భార్యభర్తల బంధమంటు నెటిజన్ల కామెంట్ లు..
Viral Video: వామ్మో.. లైవ్ లో భార్యపై పళ్లు కొరికి, కొట్టడానికి ప్రయత్నం చేసిన క్రికెట్ ఎక్స్ పర్ట్.... వైరల్ వీడియో..

Pakistan Cricket Expert Hits Wife On Air: దేశంలో కరోనా మహమ్మారి ఎప్పుడైతే పంజా విసిరిందే అప్పటి నుంచి చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాయి. ఈ క్రమంలోనే చాలా మంది తమ ఇంట్లోనే ల్యాప్ టాప్, కంప్యూటర్ల ముందు కూర్చుని తమ పనులు చేసుకుంటున్నారు. ఇంట్లో నుంచే ఆన్ లైన్ లో మీటింగ్ లు అటెంట్ అవుతుంటారు. ప్రతిదీ ఆన్ లైన్ లో ఆడియో, వీడియో కాల్స్ రూపంలో తమ పనులు చేసుకుంటున్నారు.

 

అయితే.. ఆన్ లైన్ లో జూమ్ మీటింగ్ లు జరుగుతున్నప్పుడు చాలా సార్లు ఫన్నీ  ఘటనలు జరిగి అవి కాస్త వైరల్ మారాయి. కొందరు వీడియో ఆన్ లో ఉంచామని మర్చిపోయి భార్యతో రోమాన్స్ చేయడం, మీటింగ్ దగ్గరకు పిల్లలు రావడం, సడెన్ గా ఎవరో ఎంట్రీ ఇవ్వడం వంటివి గతంలో అనేకం జరిగాయి. ఇక. కోర్టుల కేసులు కూడా ఆన్ లైన్ లోనే జరిగాయి. అప్పుడు కూడా వెరైటీ ఘటనలు జరగటం చర్చల్లో నిలిచింది. చాలా మంది ఆన్ లైన్ లో మీటింగ్ లలో ఉంటారు. కానీ కొన్ని సందర్బాలలో ఎవరైన డిస్టర్బ్ చేస్తే మాత్రం వయోలెంట్ గా రెస్పాండ్ అవుతారు. అచ్చం ఇలాంటి ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. 

పాకిస్థాన్ క్రికెట్ ఎక్స్ పర్ట్ మొహ్సిన్ అలీ ప్రస్తుతం వార్తలలో నిలిచారు. ఆయన తన సొంత యూట్యూబ్ .. 'ఆప్ కా మొహ్సిన్ అలీ'  ఛానెల్ లో లైవ్ లో ఒక మ్యాచ్ గురించి మాట్లాడుతున్నారు. ఆయన తన ఇంటి నుంచి లైవ్ లో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతలో.. వీడియోలో ఏదో అరుస్తూ ఆయన భార్య వచ్చింది. వెంటనే డిస్టర్బ్ అయిపోయిన మహ్మద్.. వయోలెంట్ గా ప్రవర్తించారు.

కోపంతో పళ్లు కొరుక్కుంటూ.. తన భార్యను చేతితో కొట్టడానికి ప్రయత్నించారు. ఆయన లైవ్ టెలికాస్ట్ అవుతుందని కూడా మర్చిపోయి, తన భార్య పట్ల దురుసుగా ప్రవర్తించారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.  మొహ్సిన్ అలీ  పెళ్లి జరిగి 31 ఏళ్లు అయినట్లు తెలుస్తోంది. ఇది వైరల్ కావడంతో దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. పెళ్లై 31 ఏళ్ల తర్వాత భార్యపై ఇదేం ప్రవర్తన అంటూ కామెంట్ చేస్తున్నారు.

దీనికి ఆయన కౌంటర్ గా.. మీకు ఆన్ లైన్ మీటింగ్ లో ఉండగా.. ఇలా డిస్టర్బ్ చేస్తే ఎలా స్పందిస్తారు..కూల్ గా ఉంటారా... మీకు కోపం రాదా.. అంటూ ఘాటుగా రిప్లై సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమంలో ట్రెండింగ్ లో నిలిచింది. 

Read More: Shivatmika Rajasekhar: గ్లామర్ డోస్ పెంచిన శివాత్మిక రాజశేఖర్.. సెగలు రేపుతున్న లేటెస్ట్ పిక్స్..

ఇదిలా ఉండగా.. పాకిస్థాన్ పురుషుల క్రికెట్ జట్టుకు డైరెక్టర్‌గా పనిచేసిన మహ్మద్ హఫీజ్‌తో ఇటీవలే బైటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. దీన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది." పురుషుల క్రికెట్ జట్టు డైరెక్టర్ మహ్మద్ హఫీజ్‌.. క్రికెట్ బోర్డుకు అమూల్యమైన సహకారం అందించారని పాక్ క్రికెట్ బోర్డు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x