Python Trapped Video: ఈ పైథాన్ కి బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలా.. కోడి పిల్లను చూసి ఎలా బొక్కబోర్లా పడిందో చూడండి!

Big Python Trapped with a LIVE Chicken: ఓ భారీ కొండచిలువ చిన్న కోడి పిల్లను తినడానికి వచ్చి ఎరలో చిక్కింది. నమ్ముకుంటే వీడియో చూడండి  

Written by - P Sampath Kumar | Last Updated : Nov 26, 2022, 01:11 PM IST
  • కోడి పిల్లను చూసి
  • బొక్కబోర్లా పడ్డ భారీ కొండచిలువ
  • నమ్ముకుంటే వీడియో చూడండి
Python Trapped Video: ఈ పైథాన్ కి బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలా.. కోడి పిల్లను చూసి ఎలా బొక్కబోర్లా పడిందో చూడండి!

 Giant Python Trapped: ఈ భూ ప్రపంచంలో ఎలాంటి భయంకర జంతువైనా, పామైనా.. ఎరకు కచ్చితంగా చికాల్సిందే. సింహం, చిరుత, ఏనుగు, జింక ఇలా ఏ జంతువైనా ఎరకు చిక్కుతుంది. నీటిలో దొరకని చాపైనా ఎరకు కచ్చితంగా చిక్కుతుంది. చిరవరకు భయంకర కొండచిలువ కూడా చిన్న ఎరకు బలవుతుంది. తాజాగా ఇలాంటి వీడియోనే సోషల్ మీడియాలో ఒకటి చక్కర్లు కొడుతోంది. ఓ భారీ కొండచిలువ చిన్న కోడి పిల్లను తినడానికి వచ్చి ఎరలో చిక్కింది. 

'ఓడ్లీ టెర్రిఫైయింగ్' (OddIy Terrifying) అనే వినియోగదారు ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియో ప్రకారం... భారీ కొండచిలువను పట్టుకోవడానికి ఓ నీటి కాలువలో ఉచ్చును వేస్తారు. కొండచిలువ ప్లాస్టిక్ పైపు గుండా వెళ్లేందుకు.. పైపు చుట్టూ కర్రలు నాటుతారు. ప్లాస్టిక్ వైపుకు ఆవల ఓ కోడి పిల్లను కట్టేస్తారు. కోడి పిల్లను చూసిన కొండచిలువ.. నీటిలో వేగంగా దూసుకొచ్చి కర్రను ఢీ కొడుతుంది. ఆపై పైకి లోపలి వెళ్లగానే.. ఉచ్చు కొండచిలువ తలకు పడుతుంది. దాంతో కోడి పిల్లను తినేందుకు ప్రయత్నించినా.. కొండచిలువకు అందదు. 

ఎర కోడిని పట్టుకోవడానికి కొండచిలువ ప్రయత్నించినా సాధ్యం కాకపోగా.. పైపులో చిక్కుకుని బయటకు రావడానికి వీల్లేకుండా పోతుంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియోను 4 రోజుల క్రితం పోస్ట్ చేయగా.. ఇప్పటికే 5 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. 'కోడి పిల్లను చూసి భారీ కొండచిలువ కూడా బొక్కబోర్లా పడింది' అని ఒకరు కామెంట్ చేయగా.. 'ఎర మహిమ ఇలానే ఉంటది మరి' అని ఇంకొకరు కామెంట్ చేశారు. 

Also Read: Odisha Train Accident: రైల్వే ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకువచ్చిన గూడ్స్ రైలు.. ముగ్గురు మృతి  

Also Read: Jason David Frank Suicide : పవర్ రేంజర్ ఇకలేరు.. ఆత్మహత్య చేసుకున్న గ్రీన్ రేంజర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News