Realme GT Neo 2 5G mobile price, specs: రియల్‌మి జిటి నియో 2 5G మొబైల్ ధర, స్పెసిఫికేషన్స్

Realme GT Neo 2 5G mobile price in india: రియల్‌మి కంపెనీ నుంచి వచ్చిన రియల్‌మి జీటీ, రియల్‌మి జిటి మాస్టర్ ఎడిషన్‌కి సీక్వెల్‌గా వచ్చిన ఫోన్ ఇది. 5G smartphones మార్కెట్‌లో ప్రీమియం ఫోన్స్ క్యూ కడుతున్న ప్రస్తుత తరుణంలో తమ యూజర్స్‌ని ఎట్రాక్ట్ చేస్తూ రియల్‌మి ఈ ఫోన్‌ని లాంచ్ చేసింది. Realme GT NEO 2 5G specs- రియల్‌మి జిటి నియో 2 5G మొబైల్ ధరలు, స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.

Written by - Pavan | Last Updated : Oct 14, 2021, 12:21 AM IST
Realme GT Neo 2 5G mobile price, specs: రియల్‌మి జిటి నియో 2 5G మొబైల్ ధర, స్పెసిఫికేషన్స్

Realme GT Neo 2 5G mobile price in india: రియల్‌మి 5G మొబైల్స్ నుంచి కొత్తగా మరో స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు రియల్‌మి జిటి నియో 2 5G మొబైల్‌ని రియల్‌మి కంపెనీ లాంచ్ చేసింది. తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌తో పాటు యూట్యూబ్ ఛానెల్లో ఈ ఈవెంట్‌‌ని రియల్‌మి లైవ్ స్ట్రీమింగ్ చేసింది. 

Realme GT Neo 2 5G mobile storage variants: రెండు వేరియంట్స్‌లో వస్తున్న స్మార్ట్‌ఫోన్:
రియల్‌మి జిటి నియో 2 5G మొబైల్ రెండు వేరియంట్స్‌లో లభిస్తుంది. అందులో ఒకటి 8GB RAM + 128GB storage వేరియంట్ కాగా మరొకటి 12GB RAM + 256GB storage వేరియంట్. మొదటి రకం వేరియంట్ ధర రూ. 31,999 కాగా రెండో రకం మొబైల్ ధర రూ. 35,999 ఉంది.

రియల్‌మి కంపెనీ నుంచి వచ్చిన రియల్‌మి జీటీ, రియల్‌మి జిటి మాస్టర్ ఎడిషన్‌కి సీక్వెల్‌గా వచ్చిన ఫోన్ ఇది. 5G smartphones మార్కెట్‌లో ప్రీమియం ఫోన్స్ క్యూ కడుతున్న ప్రస్తుత తరుణంలో తమ యూజర్స్‌ని ఎట్రాక్ట్ చేస్తూ రియల్‌మి ఈ ఫోన్‌ని లాంచ్ చేసింది.

Realme GT NEO 2 5G specs- రియల్‌మి జిటి నియో 2 5G మొబైల్ స్పెసిఫికేషన్స్:
తక్కువ ధరలో 5G మొబైల్స్‌ని అందించిన రియల్‌మి ఈసారి జీటీ ఎడిషన్‌లో అందించిన మరో ప్రీమియం రేంజ్ స్మార్ట్ ఫోన్‌గా రియల్‌మి జిటి నియో 2 5G మొబైల్‌ని చెప్పొచ్చు. 

5G processor - 5G ప్రాసెసర్: క్వాల్కామ్ స్నాప్‌డ్రాగాన్ 870 5G
Display and refresh rate - డిస్‌ప్లే: 120Hz రిఫ్రెష్ రేటుతో అమోల్డ్ డిస్‌ప్లే
Charging speed- చార్జింగ్ స్పీడ్ : 65 వాట్స్ డార్ట్ చార్జర్ (65W Dart Charge) ఈ మొబైల్‌తో వస్తోంది. 
Battery capacity - బ్యాటరీ కెపాసిటీ: బ్యాటరీతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 5000mAh కెపాసిటీతో పెద్ద బ్యాటరీని అమర్చారు.
Realme GT NEO 2 5G mobile rear cameras - వెనుక భాగంలో ఉండె కెమెరాలు: ఈ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో మొత్తం మూడు కెమెరాలు రానుండగా అందులో ఒకటి 64MP ప్రైమరీ కెమెరా, మరొక 8MP అల్ట్రా వైడ్ కెమెరా, ఇంకో 2MP మ్యాక్రో కెమెరా ఉన్నాయి.
Realme GT NEO 2 5G mobile front camera - సెల్ఫీ కెమెరా : ముందు భాగంలో అందమైన సెల్ఫీల కోసం 16MP front camera ను అమర్చారు.
LED flash - ఎల్ఇడి ఫ్లాష్: నైట్ ఫోటోగ్రఫీ షాట్స్ (Night photography) అందంగా వచ్చేలా ఎల్ఇడి ఫ్లాష్‌లైట్‌ని అమర్చారు.

Trending News