Snake Video: వడ్డానం అనుకుంటుందా ఏంటీ..?.. పామును నడుముకు చుట్టుకున్న యువతి.. షాకింగ్ వీడియో వైరల్..

Snake video Viral: స్కూల్ ఆవరణలో చెట్లలో పాము కన్పించింది. దీంతో అందరు భయంతో అరుపులు, కేకలు పెట్టారు. కానీ ఒక యువతి మాత్రం ధైర్యం చేసి వెళ్లి పామును పట్టేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Oct 31, 2024, 07:36 PM IST
  • స్కూల్ లో హల్ చల్ చేసిన పాము..
  • యువతి చేసిన పనికి షాక్ లో నెటిజన్ లు..
Snake Video: వడ్డానం అనుకుంటుందా ఏంటీ..?.. పామును నడుముకు చుట్టుకున్న యువతి.. షాకింగ్ వీడియో వైరల్..

Venomous snake viral video: సాధారణంగా చాలా మంది పాముల్ని చూస్తే భయంతో పారిపోతుంటారు. పాము పేరు తల్చుకునేందుకు కూడా అస్సలు ఇష్టపడరు. పొరపాటున ఎక్కడైన పాము కన్పిస్తే.. అక్కడికి జీవితంలో వెళ్లరు. అడవులు, పొలాలు ఉన్న చోట పాములు ఉంటాయి. ఎలుకలు ఎక్కువగా ఉండే చోట కూడా పాములు సంచరిస్తుంటారు. పాములకు చెందిన వీడియోలు తరచుగా వైరల్ గా మారుతుంటాయి. కొన్ని వీడియోలు షాకింగ్ కు గురిచేస్తే, మరికొన్ని ఇదేందిరా బాబోయ్ అన్న విధంగా ఉంటాయి.

 

పాములకు చెందిన ఘటనలు తరచుగా వార్తలలో ఉంటాయి. నెటిజన్ లు సైతం పాముల వీడియోలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి సైతం చూపిస్తుంటారు.ఈ క్రమంలో తాజాగా, ఒక యువతి పామును పట్టడటంలో చూపిన ధైర్యం చూసి నెటిజన్ లు షాక్ కు గురౌతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది

పూర్తి వివరాలు..

స్కూల్ ఆవరణంలో ఎనిమిదడుల పాము బైటికొచ్చింది. దీంతో అక్కడున్న స్టూడెంట్స్ భయంతో అరుపులు,కేకలు పెట్టారు. అంతే కాకుండా.. అక్కడి నుంచి దూరంగా పారిపోయారు.ఇంతలో ఒక యువతి ఎంటర్ అయ్యింది. మరీ ఆమెకు పాములంటే భయంలేదో లేదా పాముల్ని పట్టడంలో ట్రైనింగ్ ఏమైన తీసుకుందో కానీ.. వెంటనే పాము దగ్గరకు వెళ్లింది. దాన్ని అమాంతం పట్టేసుకుంది.

అంతటితో ఆగకుండా.. అదేదో వడ్డాణంలా పామును తన నడుముకు చుట్టుకుని మరీ పామును కంట్రోల్ చేసింది. అక్కడున్న వారు యువతిని అలా చూస్తునే ఉండిపోయారు. ఆతర్వాత యువతి పామును ఒక బ్యాగ్ లో వేసి, దూరంగా అడవిలో వదిలేసినట్లు తెలుస్తొంది.

Read more:Snake Revenge: ఇదేక్కడి రీవెంజ్.. తోటి సర్పాన్ని చంపాడని కసితీరా కాటేసిన మరో పాము.. ఎక్కడ జరిగిందో తెలుసా..?..

అక్కడున్న వారు ఈ ఘటనను వీడియోలు తీశారు. అది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం బాబోయ్.. ఇదేం ధైర్యం రా నాయన అంటూ కామెంట్ లు చేస్తున్నారు. మరికొందరు ఇదేమైన వడ్డాణం అనుకుంటుందా.. ఏంటని కూడా కామెంట్లు చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x