సింహాన్ని టచ్ చేసి చూస్తే, అది ఊరుకుంటుందా ? ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి

సింహాన్ని టచ్ చేసి చూస్తే, అది ఊరుకుంటుందా ?

Last Updated : Jun 19, 2018, 07:23 PM IST
సింహాన్ని టచ్ చేసి చూస్తే, అది ఊరుకుంటుందా ? ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి

అడవిలో సఫారీ చేయడం అంటే అది జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం లాంటిది. దట్టమైన అడవుల్లో తప్ప ఇంకెక్కడా కనిపించని భయంకరమైన క్రూరమృగాలను వాటి మధ్యలోకే నేరుగా వెళ్లి చూసే అవకాశం కేవలం సఫారీల్లో మాత్రమే ఉంటుంది. ఎంత క్రూర జంతువులైనా వాటిని ఏమి అననంత వరకు అవి కూడా కాస్త కూల్‌గానే ఉంటాయి. కానీ వాటిని కెళికి చూడాలని అనుకుంటే మాత్రం ఆ తర్వాత అవి మనుషులకు సినిమా చూపిస్తాయి. తాజాగా సౌతాఫ్రికాలో సఫారీకి వెళ్లిన బృందంలోంచి ఓ యువకుడు అక్కడ సింహాలతో వెకిలి వేషాలు వేయబోయాడు. సఫారీ వాహానం కిటికీ అద్దాల మధ్యలోంచి సింహాన్ని టచ్ చేసి చూసే ప్రయత్నం చేశాడు.. మరి ఆ సింహం ఊరుకుంటుందా చెప్పండి. పెద్దగా గాండ్రిస్తూ కోపంగా ఒక్క చూపు చూసిందంతే... ఆ చూపుకే యువకుడి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఇంకేం.. వెంటనే వాహనం అద్దాలు మూసేసి బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి బయటపడ్డారు. 

 

యువకులకు భూమ్మీద ఇంకా నూకలు మిగిలి ఉన్నట్టున్నాయి కనుక ఆ సింహం కూడా చూపుతోనే వదిలేసింది! అలా కాకుండా దాడికి దిగి ఉంటేనా.. వాళ్ల పరిస్థితి మరోలా ఉండేదేమో!!

Trending News