Bull enters SBI bank: ఎస్‌బీఐ బ్యాంక్‌లోకి దూసుకొచ్చిన ఎద్దు.. వైరల్ అవుతున్న వీడియో..

Bull Enters Bank: సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు చూసూంటాం, కానీ ఇది మాత్రం డిఫరెంట్. ఓ ఎద్దు బ్యాంకులోకి ప్రవేశించి అందరినీ భయాబ్రాంతులకు గురిచేసిన ఘటన యూపీలో చోటుచేసుకుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2024, 05:46 PM IST
Bull enters SBI bank: ఎస్‌బీఐ బ్యాంక్‌లోకి దూసుకొచ్చిన ఎద్దు.. వైరల్ అవుతున్న వీడియో..

Bull enters SBI bank: ఈ మధ్య కాలంలో ఓ అడవి ఏనుగు పక్కన ఉన్న ఫారెస్ట్ నుంచి ఏకంగా కోర్టు ప్రాంగణంలోకి అడుగుపెట్టి గందరగోళం సృష్టించడం మనం చూశాం. తాజాగా ఒక ఎద్దు బ్యాంకులోకి ప్రవేశించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. 

అసలేం జరిగిందంటే...
దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI). ఈ బ్యాంక్ శాఖలు దేశవ్యాప్తంగా కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి. అలాంటి బ్రాంచ్ ల్లో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ ఒకటి. పట్టణంలో షాహ్‌గంజ్ బ్రాంచ్ లోని బ్యాంక్ సిబ్బంది ఎప్పటిలానే ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. కొంత మంది కస్టమర్లు కూడా బ్యాంకులో ఉన్నారు. ఇంతలోనే ఓ అనుకోని అతిథి బ్యాంకు లోపలికి ప్రవేశించింది. దానిని చూసి ఆశ్చర్యపోవడం అందరి వంతు అయింది.

ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ సరాసరి బ్యాంకు లోపలికే వచ్చేసింది ఓ ఎద్దు. చూడటానికి బాహుబలి ఎద్దులా ఉంది. దానిని చూసి ఒక్కసారిగా భయందోళనకు గురయ్యారు బ్యాంక్ సిబ్బంది.  ఎక్కడ దాడి చేస్తుందనే భయంతో అందరూ దూరంగా ఉన్నారు. చాలా సేపు అక్కడే నిల్చుని అంతా గమనించింది ఎద్దు. ఎంతకి అది బయటకు వెళ్లకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఆ ఎద్దును బయటకు తరిమేశారు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ గా మారింది. 

Also Read: Viral Video today: పిల్లే కదాని దాడి చేస్తే.. పాము అయినా సరే పారిపోవాల్సిందే..

Also Read: Leaked Romantic Video: నెట్టింట రచ్చ లేపుతున్న లీకైన కపుల్స్‌ శోభనం వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News