Chandra Grahan 2023 Date And Time: మరో రెండు రోజుల్లో ఖగోళంలో కీలక సంఘటన జరగబోతుంది. గత నెల 20న సూర్యగ్రహణం ఏర్పడింది. ఇది ఏర్పడిన 15 రోజులకు వైశాఖ పూర్ణిమ రోజున చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది ఈ తొలి చంద్రగ్రహణం మే 5, రాత్రి 8:44 గంటలకు ప్రారంభమై 1:01 గంటలకు ముగుస్తుంది. 130 ఏళ్ల తర్వాత వైశాఖ పూర్ణిమ రోజున ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. పైగా ఇదే రోజు బుద్ధ పూర్ణిమ కూడా కావడం విశేషం.
గ్రహణ సమయంలో చంద్రుడు తులారాశిలో ఉంటాడు. అలాగే మిథునరాశిలో అంగారకుడు, శుక్రుడు సంయోగం జరగనుంది. దీంతో పాటు మేష రాశిలో సూర్యుడు, బుధుడు, గురుడు, రాహువుల కలయిక వల్ల చతుర్గ్రాహి యోగం ఏర్పడుతోంది. చంద్రగ్రహణ సమయంలో కొన్ని రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.
మిధునరాశి
చంద్రగ్రహణం సమయంలో శుక్రుడు మరియు కుజుడు మిథునరాశిలో కలిసి ఉంటారు. దీంతో ఈ రాశి వారు ప్రత్యేక ప్రయోజనం పొందనున్నారు. మీరు రుణ విముక్తి పొందుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు.
సింహరాశి
సంవత్సరంలో మొదటి చంద్ర గ్రహణం సింహ రాశి వారికి ప్రయోజనకరంగా ఉండబోతుంది. దీంతో మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. మీరు ఉద్యోగ, వ్యాపారాలలో మంచి లాభాలను గడిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
Also Read: Daridra Yog effect: 'దారిద్య్ర యోగం' చేయబోతున్న కుజుడు... ఈ 3 రాశులకు కష్టాలు షురూ..
మకరరాశి
చంద్ర గ్రహణం మకరరాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. మీరు కీర్తి ప్రతిష్టలు పొందుతారు.
కుంభ రాశి
ఈ రాశి వారికి చంద్రగ్రహణం శుభప్రదంగా ఉంటుంది.. కుటుంబంతో కలిసి మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.
Also Read: Shukra transit 2023: రాబోయే 27 రోజులు ఈ 5 రాశులపై డబ్బు వర్షం.. ఇందులో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook