Akshaya Tritiya 2022 Speciality: హిందూవులకు అక్షయ తృతీయ అత్యంత శుభదినం. అందులో ఈసారి అక్షయ తృతీయకు మరింత ప్రత్యేకత ఉంది. ఏకంగా వందేళ్ల వరకూ ఇలాంటి శుభ సందర్భం మళ్లీ రానేరాదట. ఆ అద్భుత అవకాశమేంటో చూద్దాం..
వైశాఖ శుక్లం మూడవరోజున అక్షయ తృతీయగా పిలుస్తారు. అది ఇవాళ అంటే మే 3వ తేదీన వచ్చింది. ఈసారి అక్షయ తృతీయకు మరో యాధృఛ్చికం తోడైంది. ఇది మరింత శుభదాయకమని పండితులు చెబుతున్నారు. ఫలితంగా ఇవాళ్టి అక్షయ తృతీయ ప్రాముఖ్యత, విలువ మరింతగా పెరిగిపోయింది. ఇవాళ చేపట్టే పనులకు జీవితంలో అంతులేని సుఖ సంతోషాల్ని ఇస్తాయని ప్రతీతి. అక్షయ తృతీయ నాడు పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, కొత్త వస్తువుల కొనుగోలు, ఇళ్లు, వాహనాలు కొనడం చాలా మంచిదని చెబుతారు.
ఈసారి అక్షయ తృతీయ..మరో వందేళ్ల వరకూ రాదట
ఈ ఏడాది అక్షయ తృతీయనాడు గ్రహాల అద్భుతమైన సంయోగం జరుగుతోంది. దీనివల్ల బంగారం, వెండి వంటి వస్తువుల్ని కొనడం చాలా మంచిదంటున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవాళ అక్షయ తృతీయనాడు సూర్యుడి మేషరశిలో చంద్రుడు కర్కాటక రాశిలో, శుక్ర, గురు గ్రహాలు మీనరాశిలో, శని కుంభరాశిలో ఉంటాయి. ఇవి కాకుండా ఇవాళ మరో 5 రాజయోగాలు సంభవిస్తున్నాయి. మొత్తం కలిపి ఇన్ని శుభ సూచకాలు తలెత్తడం రానున్న వందేళ్లవరకూ మరెన్నడూ జరగదు.
ఇంతటి మహా సంయోగం నాడు శుభాన్ని సూచించే వస్తువుల్ని కొనడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి వస్తువులు కొనడం సహజంగానే మంచిదని చెబుతారు. అటువంటిది వందేళ్ల వరకూ రాని అద్భుతమైన అక్షయ తృతీయ కాబట్టి మరింత మేలు జరుగుతుందనేది జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఒకవేళ బంగారం , వెండి కొనుగోలు చేయలేకపోతే..రాగి లేదా ఇత్తడి వంటి వస్తువుల్ని కూడా కొనవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంట్లో..సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి.
ఇవి కాకుండా ఇవాళ్టి ప్రత్యేకమైన రోజున..ఆస్థులపై పెట్టుబడులు పెట్టడం కూడా మంచిది. సంపద కొనుగోలు సంబంధిత వ్యవహారాలకు శాస్త్రం ప్రకారం మంగళవారం ఎటూ మంచిరోజే. కొత్త పనులు ప్రారంభించేందుకు ఇవాళ చాలా మంచిది.
Also read: Ganga Saptami: గంగా సప్తమి ప్రాముఖ్యత..ఆరాధన పద్ధతిని తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.