All You Need To Know Blood Moon Lunar Eclipse 2022: 2022 ఏప్రిల్ 30న తొలి సూర్యగ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇక మే 16న తొలి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈసారి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. దీనినే 'బ్లడ్ మూన్ చంద్రగ్రహణం' అని కూడా పిలుస్తారు. బ్లడ్ మూన్ గ్రహణం సమయంలో చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగులోకి మారుతాడు. ఈ నెల 16న సంపూర్ణ చంద్రగ్రహణం ఉదయం 07:02 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:20 గంటలకు ముగుస్తుంది.
బ్లడ్ మూన్ చంద్రగ్రహణంను భారత దేశంలోని ప్రజలు చూడలేరు. అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, తూర్పు పసిఫిక్, దక్షిణ పసిఫిక్, అంటార్కిటికా నుంచి మాత్రమే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. అక్కడి వాళ్లు మాత్రమే ఈ గ్రహణాన్ని పూర్తిగా చూడొచ్చు. మే 15 సాయంత్రం లేదా 16న తెల్లవారుజామున ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మీరుండే ప్రాంతాన్ని బట్టి సమయం మారుతుంటుంది. ప్రజలు బైనాక్యులర్లను ఉపయోగించి చంద్రగ్రహణాన్ని చూడొచ్చు. ఈ గ్రహణం కంటికి కనిపించినప్పటికీ.. బైనాక్యులర్లను ఉపయోగించడం వల్ల కాస్త స్పష్టంగా కనిపించనుంది.
చంద్రుడు, భూమికి మధ్య సూర్యుడు వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అదేవిధంగా సూర్యుడు, చంద్రుడు, భూమి సరళ రేఖలోకి వచ్చినప్పుడు.. భూమి నీడ చంద్రుడిపై పడి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈసమయంలో చంద్రుడు పూర్తిగా ఎర్రగా మారిపోతాడు. చంద్రుడు, సూర్యుడి మధ్యలోకి భూమి వచ్చినప్పుడు చంద్రుడిపై కొద్దిగా నీడ పడుతుంది. అప్పుడు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
ఏప్రిల్ 30 ఏర్పడిన సూర్యగ్రహణం మాదిరే మే 16 ఏర్పడనున్న సంపూర్ణ చంద్రగ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు. భారత దేశం ప్రజలు బ్లడ్ సూపర్ మూన్ చంద్రగ్రహణంను చూడలేరు. అయితే ఈ ఏడాది వచ్చే రెండు గ్రహణాలను మాత్రం దేశ ప్రజలు వీక్షించగలరు. అక్టోబర్ 25న పాక్షిక సూర్యగ్రహణం, నవంబర్ 7-8 తేదీల్లో ఏర్పడే పాక్షిక చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించనుంది.
Also Read: Sonakshi Sinha Engagement: వైరల్ ఫొటోస్.. ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో సోనాక్షి సిన్హా!
Also Read: Pooja Hegde Saree Pics: సారీలో పూజా హెగ్దే.. ఇలా కూడా మెరిసిపోతున్న బుట్టబొమ్మ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook