Bedroom Vastu Tips: మనిషి జీవితంలో ఎంతో పవిత్రమైన బంధం.. వైవాహిక బంధం. అయితే భారతీయులపై పాశ్చాత్య ప్రభావం వల్ల లేదంటే మారుతోన్న పరిస్థితుల ప్రభావం వల్ల ఇప్పుడు ఆ బంధానికి కొందరు పెద్దగా విలువ ఇవ్వడం లేదు. చాలా జంటలు చిన్న చిన్న కారణాలకే విడిపోతూ విడాకులు తీసుకునే పరిస్థితి ఇటీవల కాలంలో పెరిగిపోయింది.
అయితే వైవాహిక బంధం సాఫీగా సాగాలంటే ఇంట్లో కూడా కొన్ని సూత్రాలు పాటించాల్సి ఉంటుంది. వాస్తు నిపుణుడు ఆచార్య మనోజ్ శ్రీవాస్తవ వైవాహిక బంధంంలో ఎక్కువగా ఆనందంగా ఉండాలంటే కొన్ని వాస్తు చిట్కాలు పాటించాలంటున్నారు.
ఇంటిలో నైరుతి భాగం వైవాహిక బంధం ఆనందంగా ఉండేందుకు ఎంతో దోహదం చేస్తుంది. అందుకే వాస్తు కన్సల్టెంట్స్... నైరుతిలోనే మాస్టర్ బెడ్‌రూమ్ ఉండాలి సూచిస్తుంటారు. ఇంట్లో నైరుతి భాగంలో నిద్రించడం వల్ల మీ వృత్తిలో మీరు సులభంగా విజయం సాధించగలుగుతారు.
ఇక ఇదే భాగంలో టాయిలెట్ ఉంటే వివాహ బంధంలో ఎక్కువ ఆనందంగా ఉంటారు.
అయితే కొందరు నైరుతి ప్రాంతంలో కాకుండా దానికి పక్కనే ఉండే భాగంలో సౌత్ వెస్ట్ జోన్‌లో నిద్రిస్తుంటారు. దీంతో వైవాహిక బంధంలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందువల్ల సౌత్ వెస్ట్ జోన్‌లో నిద్రపోకుండా చూసుకోవాలి.
ఇక బెడ్ రూమ్‌లో రెడ్, వైలెట్, పర్పుల్, గ్రీన్, బ్లూ కలర్స్‌లో గోడలు కానీ ఎలాంటి అలంకరణలు కానీ ఉండకుండా చూసుకోండి. ఇక ఈ భాగంలో హంసలు, మాండరిన్ బాతులు, పియోనీ పువ్వులు లేదా డబుల్ హ్యాపీనెస్ సింబల్స్‌ను ఉంచితే మంచిది.
అయితే ప్రస్తుతం చాలా ఇళ్లలోకి, అపార్ట్‌మెంట్‌లలోకి అసలు గాలి, వెలుతురు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. దీంతో నిత్యం పాత గాలినే ఇంట్లోనే తిరుగుతోంది. ఇంట్లో సూర్యకాంతి, గాలి సరిగ్గా లేకపోవడం వల్ల అది మీ మానసిక ప్రశాంతతను ప్రభావితం చేస్తుంది. ఇంట్లోకి కచ్చితంగా గాలి, వెలుతురు వచ్చేలా ఉండాలి. వాస్తు పరంగా ఇలాంటి చిట్కాలన్నీ పాటిస్తే సంసారం సాఫీగా సాగిపోతుంది.
Also Read: Money Problems: మంగళవారం నాడు ఇలా చేస్తే మీ కష్టాలన్నీ హుష్‌కాకీ అవుతాయట!
Also Read:Magh Purnima 2022: లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలంటే ఇలా చేయండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook