Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారి ఆత్మగౌరవం దెబ్బతినే అవకాశం!

Horoscope: బుధవారం (ఫిబ్రవరి 16) అనేక రాశుల వారికి ఇలా గడుస్తుంది. వృశ్చిక రాశి కలిగిన వారు నేడు తమ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది. మకరరాశి వారికి వివిధ రూపాల్లో లాభం చేకూరుతుంది. మరోవైపు మీన రాశి వారికి ఊహించని బహుమతులు అందుతాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 16, 2022, 07:17 AM IST
    • 2022 ఫిబ్రవరి 16 (బుధవారం).. రాశి ఫలాలు
    • మీన రాశి వారికి నేడు ఉద్యోగం ప్రాప్తి!
    • తులా రాశి వారి ఆత్మగౌరవం దెబ్బతినే అవకాశం
Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారి ఆత్మగౌరవం దెబ్బతినే అవకాశం!

Horoscope: నేడు (ఫిబ్రవరి 16) సింహ రాశి వారికి కలిసొచ్చే రోజు. అదే విధంగా తులా రాశి వారి ఆత్మగౌరవానికి నేడు భంగం కలిగే అవకాశం ఉంది. వీరితో పాటు మిగిలిన రాశుల వారి భవిష్యత్తు నేడు ఎలా ఉందో తెలుసుకోండి. 

మేష రాశి (Aries)

బుధవారం నాడు మీ ప్రణాళికలు ఫలిస్తాయి. ఉద్యోగంలో మార్పులు సంభవించవచ్చు. అలాగే వ్యాపారంలో అనుకూలమైన రాబడి వస్తుంది. వృత్తిపరంగా మీ హోదా పెరిగే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాలను పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. 

వృషభ రాశి (Taurus)

ఈ రాశి వారు నేడు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. కాబట్టి మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంది. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కుటుంబసభ్యులు, సన్నిహితుల నుంచి సరైన సమయంలో మద్దతు పొందుతారు. 

మిథున రాశి (GEMINI)

మిథున రాశి వారు నేడు పార్టీ లేదా వనభోజన కార్యక్రమాల్లో పాల్గొంటారు. నేడు వీరికి ఆనందంగా కొనసాగుతుంది. ఇష్టమైన వంటకాలను తింటారు. వ్యాపారంలో రాబడి వస్తుంది. ఎవరితోనైనా గొడవ పడే ముందు ఆలోచిస్తే మంచిది. 

కర్కాటక రాశి (Cancer) 

ఈ రాశి వారిని ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్న కారణంగా కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. నేడు కొన్ని చెడువార్తలను వినే అవకాశం ఉంది. నేడు ఒత్తిడికి లోనవుతారు. ప్రసంగాలలో అనుచిత పదాలను వాడడం మానుకోండి. ఈ రాశి వారు ఎంత ఎక్కువ కష్టపడినా.. తక్కువ లాభాన్నే పొందుతారు. 

సింహరాశి (LEO)

సింహ రాశి వారు ఉద్యోగం చేసే కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. ఆస్తి వ్యవహరాలు నేడు సమసిపోయే అవకాశం ఉంది. శారీరక ఒత్తిడి కారణంగా కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడినా.. జాగ్రత్తగా, తెలివిగా వ్యవహరించండి. 

కన్యా రాశి (Virgo)

నేడు ఈ రాశి వారు సామాజిక సేవలో పాల్గొనేందుకు పాటుపడతారు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీరు పడే కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. వ్యాపారవేత్తలకు నేడు లాభదాయకం. నేడు రిస్క్ తీసుకునే ధైర్యం మీలో ఉంటుంది. వివిధ రంగాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలను పొందుతారు. మీ పనితో మీరు సంతోషంగా ఉంటారు. శత్రువులు, అసూయ పడే వ్యక్తుల నుంచి జాగ్రత్త అవసరం. 

తులా రాశి (Libra)

తులా రాశి నేడు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. వాటి వల్ల అపార నష్టం కలిగే అవకాశం లేకపోలేదు. అనారోగ్యం దెబ్బతినే సమయమిది. ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు వహించడం మంచిది. ఇతరులతో మాటల యుద్ధం జరగవచ్చు. మీ ఆత్మగౌరవానికి భంగం వాటిల్లవచ్చు. నేడు ఈ రాశి వారికి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి.

వృశ్చిక రాశి (Scorpio)

ఈ రాశి వారు నేడు తమ పాత లేదా ఆప్త మిత్రులను కలిసే అవకాశం ఉంది. దీంతో రోజంతా ఆనందంగా, ఆహ్లాదంగా గడుపుతారు. నేడు వీరికి అదనపు ఖర్చులు అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభం పొందుతారు. 

ధనుస్సు రాశి (Sagittarius) 

ఈ రాశి వారికి నేడు ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాల్లో లాభాలను పొందుతారు. అలాగే చేసే పనిలో అభినందనలు పొందుతారు. తొందరపాటు పనుల వల్ల కొంతమేర నష్టం చవిచూడాల్సి వస్తుంది. కొత్త వెంచర్లను ప్రారంభించేందుకు నేడు ప్రణాళికలు సిద్ధం చేస్తే మంచిది.

మకర రాశి (Capricorn) 

మకర రాశి వారికి నేడు చెడు జరిగే అవకాశం ఉంది. వృధా ఖర్చులు ఎక్కువ చేస్తుంటారు. మాట్లాడే ప్రతిసారి జోకులు వేయడం మానుకోండి. చేపట్టిన పనులు ఆలస్యమవుతాయి. అనవసర విషయాలను వదిలిపెట్టండి. వ్యాపారంలో అవకాశాలు లాభిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ విచక్షణ కోల్పోకండి. 

కుంభ రాశి (Aquarius)

కుంభ రాశి వారికి నేడు అనేక విధాలుగా మద్దతు లభిస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో వెసులుబాటు కలుగుతుంది. ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటాయి. నేడు కొన్ని వాణిజ్య ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. అందులో లాభాలను పొందొచ్చు. 

మీన రాశి (Pisces) 

ఈ రాశి వారు నేడు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఊహించని బహుమతులు పొందే అవకాశం ఉంది. వ్యాపారాల పరంగా విజయం వరిస్తుంది. స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ నుంచి అనుకూలమైన లాభాలు వస్తాయి. చేసే ప్రతి పని నుంచి మీకు ఆనందం లభిస్తుంది. కానీ, అన్నింటా తొందర పనికి రాదు.  

Also Read: Horoscope Today 15th FEB 2022: నేటి రాశిఫలాలు.. ఈ రాశివారు కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారు!

Also Read: Horoscope Today 13th FEB 2022: నేటి రాశిఫలాలు.. వ్యాపారంలో పెట్టుబడి ఈ రాశుల వారు జాగ్రత్త ఉండాలి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News