Chhath Puja 2023: ఛత్‌ పూజలో ఖర్నా పూజకు ఉన్న ప్రాముఖ్యత, పూజా సమయాలు, ఖర్నా పూజ ప్రాముఖ్యత..

Chhath Puja 2023: ఛత్‌ పూజలో భాగంగా ఈ రోజు రెండవ రోజు..భక్తులంతా ఈ రోజు నుంచే ఖర్నా పూజలు ప్రారంభిస్తారు. అయితే ఈ రోజు నుంచి సూర్యదేవుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల జీవితంలో కోరుకున్న కోరిక నెరవేరడమే కాకుండా సంతానం కూడా కలుగుతుందని భక్తుల నమ్మకం..

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2023, 09:57 AM IST
Chhath Puja 2023: ఛత్‌ పూజలో ఖర్నా పూజకు ఉన్న ప్రాముఖ్యత, పూజా సమయాలు, ఖర్నా పూజ ప్రాముఖ్యత..

 

Chhath Puja 2023:  భారతదేశ వ్యాప్తంగా ఛత్ పూజ ప్రారంభమైంది. ఈ మహా ఉత్సవాల్లో భాగంగా ఈరోజు రెండో రోజు..ఈ 4 రోజుల పండుగ సందర్భంగా సూర్య భగవానుడిని పూజించడం ఆనవాయితిగా వస్తోంది. ఈ పూజను భక్తులు ఖర్నా సంప్రదాయ బద్దంగా జరుపుకుంటారు. ఈ పండగను వివిధ రాష్ట్రాల్లో సూర్య షష్ఠి అని కూడా పిలుస్తారు. ఈ నాలుగు రోజు పాటు సూర్య దేవుడికి ప్రత్యేక భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాలు చేయడం వల్ల సంచానం కలిగి ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల నమ్మకం..అయితే రెండవ రోజు పూజలో భాగంగా ఏయే సమయాల్లో ప్రత్యేక పూజలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఛత్ పూజ శుభ సమయం:
రోజు: నవంబర్‌ 18, 2023
బ్రహ్మ ముహూర్తం: సాయంత్రం 04:59 నుంచి సాయంత్రం 05:52 వరకు
సూర్యోదయం: ఉదయం 06:45
సూర్యాస్తమయం: రాత్రి 09:26

Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!  

ఖర్నా పూజ విధానం:
ఖర్నాపూజలో భాగంగా ఉదయాన్నే నిద్రలేవాల్సి ఉంటుంది. ముందుగా తల స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి..భక్తితో నమస్కరించాల్సి ఉంటుంది. 
సాయంత్రం పూట జరిగే పూజలో భాగంగా..అన్నం, బెల్లం, పాలతో చేసిన ఖీర్‌ను మట్టి పొయ్యిపై తయారుచేయాలి.
ఛత్‌ మత సాంప్రదాయ బద్ధంగా సూర్యదేవుడికి సమర్పించాలి.
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసాలు ఉన్నవారు ముందుగా ప్రసాదాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. 
ఈ రోజు నుంచే 36 గంటల పాటు నిర్జల ఉపవాసం ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండాల్సి ఉంటుంది.

ఖర్నా పూజ ప్రాముఖ్యత:
ఖర్నా అంటే సాంప్రదాయం ప్రకారం స్వచ్ఛత అని అర్థం..ఈ పూజను చేయాలనుకునేవారు ముందు రోజే స్నానం చేసి భోజనం చేసి ఆ తర్వాతి మరసటి రోజు ఈ పూజను జరుపుకోవాల్సి ఉంటుంది. ఈ పూజలో పాల్గొనేవారు మనస్సు ప్రశాతంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. అంతేకుండా ఖర్నా పూజ నుంచే భక్తుల 36 గంటల కఠోర ఉపవాసాలు పాటిస్తారు.  

Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News