/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Hanuman Janmotsav 2022 Puja Vidhi: నేడు (ఏప్రిల్ 16, 2022) హనుమంతుని జయంతి. ఈ రోజున దేశవ్యాప్తంగా హనుమాన్ జన్మోత్సవాన్ని (Hanuman Janmotsav 2022) వైభవంగా జరుపుకుంటారు భక్తులు. ఇవాళ పవన పుత్రుడైన హనుమంతుడిని పూజిస్తే.. జీవితంలోని కష్టాలను తొలగిస్తాడని భక్తుల విశ్వాసం. ఈ రోజున ఆంజనేయుడి పంచముఖ అవతారాన్ని పూజిస్తే చాలా ప్రయోజనకరం. 

రామాయణంలో ప్రస్తావించబడిన విధంగా..హనుమంతునికి ఐదు ముఖాలు ఉన్నాయి. అవి నరసింహ, గరుడ, గుర్రం, వానర, వరాహ. ఈ ఐదు రూపాల్లో ఏదో ఒకదానిని పూజిస్తే.. విజయం, దీర్ఘకాల జీవితం, ఆనందం మరియు సంపద ఇస్తాయి. అదే సమయంలో భయం కూడా దూరమవుతుంది.  హనుమాన్ జన్మోత్సవం రోజు హనుమాన్ చాలీసా పఠిస్తే దైవ అనుగ్రహం సిద్దిస్తుంది.

Also Read: Hanuman Janmotsav 2022: 'హనుమాన్ జయంతి' అనొద్దు.. 'హనుమాన్ జన్మోత్సవం' అనాలి.. ఎందుకంటే...

హనుమంతుడిని ఇలా పూజించండి:
హనుమాన్ జన్మోత్సవం (Hanuman Jayanti) రోజున... దక్షిణ దిశకు అభిముఖంగా కూర్చుని, ఆపై ఒక స్తంభంపై ఎర్రటి వస్త్రాన్ని కప్పండి. దానిపై పంచముఖి బజరంగ్ యంత్రాన్ని అమర్చండి. ఆపై మల్లె, మందార పువ్వులతో పూజించండి. ఆవు నెయ్యితో చేసిన శెనగపిండి లడ్డూలు, పండ్లు మొదలైన వాటిని  బజరంగబలికి సమర్పించండి. నూనెతో దీపం వెలిగించి, ధూపం వేయండి. చివరగా 'ఓం హూఁ హుసౌఁ హస్ఫ్రేఁ హూఁ హనుమంతే నమః' అనే మంత్రాన్ని జపిస్తూ..పూజించండి. ఈ రోజున బ్రహ్మచర్యాన్ని పాటిస్తే మంచిది. నేలపై నిద్రించండి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Section: 
English Title: 
Hanuman Janmotsav 2022 Date, Puja Vidhi Full details here
News Source: 
Home Title: 

Hanuman Janmotsav 2022: ఈరోజున హనుమంతుడిని పూజిస్తే...జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయట..
 

Hanuman Janmotsav 2022: ఈరోజున హనుమంతుడిని పూజిస్తే... జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయట..
Caption: 
Representational Image
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

ఇవాళ హనుమాన్ జయంతి

పూజా విధానం వివరాలు
 

Mobile Title: 
Hanuman Janmotsav 2022: నేడు హనుమాన్ జన్మోత్సవం, పూజా విధానం
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Saturday, April 16, 2022 - 10:33
Request Count: 
42
Is Breaking News: 
No