Happy Pongal 2023: సనాతన ధర్మంలో మకర సంక్రాంతికి చాలా ప్రాముఖ్యత ఉంది. సూర్యుడు మకర రాశిలోకి సంచారం చేయడం వల్ల మకర సంక్రాంతిని జరుపుకుంటారని పురాణాల్లో పేర్కొన్నారు. అయితే ఈ సంవత్సరం మకర సంక్రాతి 15 జనవరి వస్తోంది. సూర్య గ్రహం మకర రాశిలోకి సంచారం చేయడం కారణంగా మంచి రోజులు మొదలవుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇదే క్రమంలో వివాహం వేడుకలు, గృహ ప్రవేశం, గృహనిర్మాణాలకు సంబంధించి మంచి ముహూర్తాలు కూడా ప్రారంభమవుతాయి. మకర సంక్రాంతి రోజున దానం, దక్షిణ మొదలైన వాటికి చాలా ప్రాముఖ్యత ఉందని పూర్వీకులు పేర్కొన్నారు. సంక్రాంతి రోజున ఎలాంటి ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయో, అంతేకాకుండా ఆ రోజు చేయకూడని పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మకర సంక్రాంతి శుభ ముహూర్తాలు:
ఈ సారి మకర సంక్రాంతి 15 జనవరి రాబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే శుభ గడియలు 14 జనవరి 08.43 గంటలకు (సంక్రాంతికి ముందు రోజు) ప్రారంభమవుతాయి. మకర సంక్రాంతి శుభ ముహూర్తం జనవరి 15న ఉదయం 06:47 గంటలకు ప్రారంభమై సాయంత్రం 05:40 గంటలకు ముగిసే అవకాశాలున్నాయి. ఇక మహాపుణ్యకాలం విషయానికొస్తే.. ఉదయం 07.15 నుంచి 09.06 వరకు ఉంటుంది. పురాణాల ప్రకారం.. పుణ్య సమయాలలో స్నానం చేసి దానం చేయడం శ్రేయస్కరం. సంక్రాంతి రోజు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12.09 నుంచి రాత్రి 12.52 వరకు ఉంటుంది.
మకర సంక్రాంతి రోజున చేయకూడని పనులు ఇవే:
1. మాంసం తినకూడదు:
మకర సంక్రాంతి హిందువులకు చాలా ముఖ్యమైన పండగ కాబట్టి మాంసం, వెల్లుల్లి కలిగిన ఆహారాలు తినకపోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రోజు తీపి పదార్థాలు తినడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
2. ఇతరులను దూషించ కూడదు:
మకర సంక్రాంతి రోజున ఎవ్వరికీ తప్పుడు మాటలు చెప్పకూడదు. అంతేకాకుండా ఎవరి మీద కోపం తెచ్చుకోకూడదని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఎవరినీ దూషించే పదాలు కూడా వాడకూడదు.
3. చెట్లను నరిక కూడదు:
మకర సంక్రాంతి రోజున చెట్లను నరకడం అశుభమని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అయితే ఈ రోజూ కావాల్సి వస్తే చెట్లు పెట్టొచ్చు..కానీ చెట్లు నరకడం అంత మంచిది కాదని శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
4. గంగా స్నానం:
ప్రతి ఒక్కరూ ఈ రోజూ గంగా స్నానం చేసిన తర్వాతే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీ చుట్టు పక్కలో ఉండే, మీ స్థానికంగా ఉండే గంగా నదిలోకి వెళ్లి స్నానాలు చేయడం చాలా మంచిది.
Also read: Supreme Court: ఏపీ హైకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు, సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం
Also read: Supreme Court: ఏపీ హైకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు, సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook