Today Horoscope: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 25, 2021 Rasi Phalalu

Today Horoscope In Telugu 25 February 2021: ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 25, 2021, 08:10 AM IST
Today Horoscope: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 25, 2021 Rasi Phalalu

Horoscope Today 25 February 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఫిబ్రవరి 25న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
మీరు ప్రేమను పొందడం కోసం తపిస్తారు.  మీ మనసులో మాటను వారికి చెప్పడం మంచిది. లేకపోతే అవతలి వ్యక్తికి మీ ప్రేమ సంగతి తెలియదు. సమాజంలో గౌరవం దక్కుతుంది. మానసిక ఆందోళన పెరుగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అంతగా కలిసిరాదు. మీ ఆందోళన కారణంగా పనులలో జాప్యం ఏర్పడుతుంది. 

Also Read: Srisailam Brahmotsavalu: మహా శివరాత్రికి ముస్తాబవుతున్న శ్రీశైలం క్షేత్రం

వృషభ రాశి
కొన్నిసార్లు మీరు కోరుకున్న తీరుగా పనులు జరుగుతాయి. మీకు ఆకస్మిక ధనలాభం సూచిస్తుంది. మీరు ఇష్టపడే వ్యక్తులతో మనసులో మాటలు చెబుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించక తప్పదు. కొందరు మీకు నమ్మకద్రోహం చేసే అవకాశం ఉంది.

మిథున రాశి
కొందరు వ్యక్తులకు నేడు దూరంగా ఉండటం శ్రేయస్కరం. లేదా వారితో మీరు గడిపనున్న సమయం మిమ్మల్ని అవమానాలకు గురిచేసే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు పెరగడంతో పాటు ఆకస్మిక ధననష్టం గోచరిస్తుంది. పనిరీత్యా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. మీ పనులపై శ్రద్ధ వహించాల్సిన సమయం ఇది. అనారోగ్య సమస్య బాధిస్తుంది. 

కర్కాటక రాశి
గతంలో మీరు చూడలేని కొత్త ప్రదేశాలకు ప్రయాణాలు చేయనున్నారు. దీంతో మీ కల నెరవేరనుంది. మీ మనసు ప్రశాంతంగా ఉండటంతో ఆనందంగా గడుపుతారు. మరియు మీరు ఎప్పుడూ చేయని పనులు చేయండి. అయితే పనులు మధ్యలోనే ఆగిపోయే అవకాశాలున్నాయి. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ పరిస్థితులు గోచరిస్తున్నాయి.

Also Read: Astrology: కుంభరాశిలోకి శుక్రుడు ప్రవేశం, 12 రాశుల వారిపై దీని ప్రభావం ఇలా ఉండనుంది

సింహ రాశి
కొందరు మీ సహాయం కోసం వస్తారు. ఆ ప్రత్యేక వ్యక్తికి మీ నైపుణ్యాన్ని అందించి పనిని పూర్తి చేస్తారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. కానీ అనారోగ్య సమస్యల బారిన పడతారు. తద్వారా మానసికంగా ఆందోళనకు గురవుతుంటారు. సాయం చేసే గుణం కారణంగా గౌరవం, మర్యాద పొందుతారు.

కన్య రాశి
మీ చుట్టూ ఉన్న వ్యక్తులను మీ పనిలో భాగస్వాములు చేయడానికి ప్రోత్సహించండి. కొంతమంది కుట్రలు పన్నుతారు. మీరు వారిని గుర్తించేందుకు ఇది తగిన సమయం. ఖర్చులు పెరుగుతాయి. రుణాల కోసం యత్నాలు ఆరంభిస్తారు. కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. ఉద్యోగులు జట్టుగా పనిచేస్తేనే ప్రయోజనాలు అందుతాయి. 

తులా రాశి
మీకు సమస్య ఎదురైతే దాన్ని పరిష్కరించేందుకు శతవిధాలా యత్నిస్తారు. మీ ప్రయత్నం కారణంగా సమస్య నుండి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండదు. సోమరితనం వల్ల పనులలో జాప్యం ఏర్పడుతుంది. ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోకుండా ఉంటే మీకు కష్టాలు తగ్గుతాయి. 

వృశ్చిక రాశి
ఈరోజు మీకు కొన్ని పనులు చికాకు తెప్పిస్తాయి. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ ఉత్పాదకతను పెంచడానికి ప్రేరణ కోసం పలు మార్గాలను అన్వేషిస్తారు. మీరు మీ కంప్యూటర్ స్క్రీన్ ముందు గంటలపాటు కూర్చోలేరు. ఆర్థిక, అనారోగ్య సమస్యలు మిమ్మల్ని అధికంగా బాధిస్తాయి. అధైర్యపడకుండా ముందుకు సాగుతారు.

ధనుస్సు రాశి
ఈరోజు ధనుస్సు రాశి వారికి సమాజంలో గౌరవం, పేరు ప్రతిష్టలు వస్తాయి. అందరి కళ్లు మీపైనే ఉంటాయి. దీంతో మీరు చాలా సంతోషంగా గడుపుతారు. అదే సమయంలో మీ పనులను మాత్రం నిర్లక్ష్యం చేయరాదని గ్రహిస్తారు. ప్రయాణాలతో మీ ఖర్చులు అధికం అవుతాయి. రుణాల కోసం యత్నాలు మొదలుపెడతారు. అయినా కూడా ఇతరులకు సహాయం చేసేందుకు ఒక అండుగు ముందుకు వేయనున్నారు.

మకర రాశి
మీ మెదడులో ఎన్నో ఆలోచనలు ఉత్పన్నమవుతాయి. వాటి వల్ల మీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు. అయితే మీ ఆలోచనను మంచి వైపు మరల్చితే అంతా మేలు జరుగుతుంది. మీరు ఎదగటంలో ఆటంకం కలిగించే వ్యక్తులను గుర్తిస్తారు. ఉద్యోగులు వారి నైపుణ్యాన్ని నిరూపించుకుంటారు. నేడు ఈ రాశివారిని అణగదొక్కడానికి ప్రయత్నిస్తారు. మిత్రులు, సన్నిహితులతో గొడవలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి.

కుంభ రాశి
సోమరితనం పెరుగుతుంది. ఈరోజు మీకు ఏ పని చేయాలని అనిపించదు. విశ్రాంతి తీసుకోవాలని భావిస్తారు. మీరు మిమ్మల్ని  నిరూపించుకోవాలనుకుంటే బద్ధకాన్ని అధిగమించి పనిని మొదలుపెట్టాలి. అనారోగ్య సమస్య గోచరిస్తుంది. కొన్ని పనులలో జాప్యం జరుగుతుంది.

మీన రాశి
లక్ష్యాలుగా మారిన మీ కలలు నేడు కార్యరూపం దాల్చనున్నాయి. మీరు సహనాన్ని కోల్పోకూడదని గుర్తుంచుకోవాలి. చాలా విజయవంతమైన ప్రాజెక్టులు పూర్తి చేయనున్నారు. కుటుంబం నుంచి సహకారం లభిస్తుంది. రుణాలు తీరతాయి. ఆకస్మిక ధనలాభం. రుచికరమైన వంటలు ఆరగిస్తారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News