Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మే 30, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం

Horoscope Today 30 May 2021: ప్రతి ఒక్క రాశికి ఓ ప్రత్యేక లక్షణం ఉంటుంది. శ్రీ ప్లవ నామ సంవత్సరం మే 30వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 30, 2021, 08:02 AM IST
Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మే 30, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం

మేష రాశి (Horoscope Today 30 May 2021)
నేడు మీ మనసు మాటను వినండి. మీలోని పాజిటివ్ విషయాలు గ్రహించి నడుచుకోనున్నారు. దాని వల్ల ఇతరులు మిమ్మల్ని గౌరవిస్తారు. ఓపెన్ మైండ్ ఉంచండి మరియు మీ ఆలోచనలను ఇతరులతో పంచుకుంటేనే ప్రయోజనం. వాహనాలు కొనుగోలు చేయనున్నారు. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది. చేపట్టిన పనులు పూర్తి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తారు.

వృషభ రాశి
గతాన్ని మరిచిపోండి. ప్రస్తుతం జరగాల్సిన విషయాలపై ఆలోచించాలి. తర్వాత ఏం జరుగుతుందో దానిపై దృష్టిసారించాలి. ఆధ్యాత్మిక చింతన పెరగడంతో దైవదర్శనాలు చేసుకోవాలని యోచిస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు. ఉద్యోగులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.

Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి

మిథున రాశి
మీ జీవితం సరిగా సాగడం లేదని మీరు భావిస్తుంటే, ఈ రోజు కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. నేడు మీ కెరీర్ లేదా పనిలో కొన్ని మార్పులు గమనిస్తారు. ప్రతి విషయంలోనూ సానుకూల ధోరణితో వ్యవహరిస్తారు. అతిగా ఆశ పడతారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఖర్చులు అధికం కావడంతో సన్నిహితులు, కుటుంబసభ్యులతో విభేదాలు తలెత్తుతాయి.

కర్కాటక రాశి 
మీ చుట్టూ ఉన్న కొందరు మార్పులకు లోనవుతారు. వారి ద్వారా మీ పనులు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు వారిని గుర్తించి సహాయం కోరడం అత్యవసరం. సన్నిహితుల సాయం అందుతుంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయాలి. వ్యాపారం విస్తరణపై వర్తకులు దృష్టిసారిస్తారు. కొన్ని విషయాలలో ఆచితూచి వ్యవహరించకపోతే సన్నిహితులతో వివాదాలు మొదలవుతాయి.

సింహ రాశి
కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి మీకు ఇది తగిన సమయంగా భావిస్తారు. మీ వ్యక్తిగత వృద్ధికి మార్పులు దోహదం చేయనున్నాయి. అయినప్పటికీ, మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని మాత్రం మరిచిపోవద్దు. శుభకార్యాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తారు. ఉద్యోగులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అవసరమైన సమయంలో సాయం అందుతుంది. 

కన్య రాశి
చేపట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోతాయి. ఖర్చులు అధికం కావడంతో కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు. ప్రస్తుతం కాస్త వేచిచూసే ధోరణిలో వ్యవహరించడం శ్రేయస్కరం. వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకోవాలి.

Also Read: Fertility Myths: సంతానలేమిపై మగవారిలో 5 ముఖ్యమైన సందేహాలు, వాటి సమాధానాలు

తులా రాశి
ఆర్థికంగా స్థిరపడాలన్న మీ కోరిక అంత సులువుగా నెరవేరదు. కొన్ని విషయాలు నియంత్రణలో లేని కారణంగా మీరు ఇప్పటికీ వృథా ఖర్చులు చేస్తున్నారు. ఇకనుంచి ఆదా చేయండి. చేపట్టిన పనులలో జాప్యం తలెత్తుతుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి అధికం అవుతుంది. కుటుంబసభ్యులు అనారోగ్యం బారిన పడతారు. 

వృశ్చిక రాశి
మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేస్తున్నారు. అయితే మీ మానసిక స్థితి ఇతరులను ప్రభావితం చేయనివ్వకుండా చూసుకోండి. కొందరు ఈ అవకాశం కోసం ఎదురుచూసే అవకాశం ఉంది. పని నుంచి కాస్త విరామం తీసుకుని కుటుంబంతో గడపాలి. నేడు ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది.

ధనుస్సు రాశి
ఈ రోజు పనిచేసే చోట మీకు ప్రమోషన్ లభిస్తుంది. స్థాయికి మించిన బాధ్యత అని ఆందోళన చెందవద్దు. గతంలో కంటే ఖర్చులు అధికం అవుతాయి. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు. ఆచితూచి అడుగు వేయకపోతే మరింత నష్టం వాటిల్లుతుంది.

Also Read: Lunar Eclipse 2021: చంద్ర గ్రహణం ఈ రాశుల వారిపై ప్రభావం చూపుతుంది

మకర రాశి
మీరు ఎల్లప్పుడూ ఆశావహ ధోరణితో వ్యవహరిస్తారు. దీని వల్ల మీకు ప్రయోజనం చేకూరుతుంది. ఉద్యోగులకు పనిచేసేచోట ప్రోత్సాహం అధికం అవుతుంది. ఇతరులు సహాయం చేసినా, చేయకపోయినా మీ వంతుగా మీరు శ్రమిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. కొన్ని శుభవార్తలు చెవిన పడతాయి.

కుంభ రాశి
ఆలోచనల్ని వదిలిపెట్టి ఆచరణ దిశగా అడుగులు వేయాలని భావిస్తారు. ఈ మార్పు కచ్చితంగా మీకు ప్రయోజనం అందిస్తుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కానీ ప్రయాణాలకు ఇది తగిన సమయం కాదు. మనసు, మెదడు మధ్య సంఘర్షణ మొదలవుతుంది. దేని మాట వినాలో తేల్చుకోలేని అయోమయస్థితికి లోనవుతారు. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు.

మీన రాశి
మీనరాశి వారు ఈ రోజును జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఇతరులతో మీ సంబంధాలకు ఆటంకం కలిగించకుండా కొన్ని పనులు పూర్తి చేయాలని భావిస్తారు. కొన్ని కీలక విషయాలపై చర్చిస్తారు. ఉద్యోగులు ఆశించాలు ఫలితాలు అందుకుంటారు. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది. ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షించుకోవాలి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News