Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మార్చి 5, 2021 Rasi Phalalu, నేడు వారికి వస్తులాభం

Today Horoscope In Telugu 5 March 2021: మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 5న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 5, 2021, 08:03 AM IST
Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మార్చి 5, 2021 Rasi Phalalu, నేడు వారికి వస్తులాభం

Horoscope Today 5 March 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 5న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
ఈ రోజు సమయ నిర్వహణ కీలకం కానుంది. మీ ఆలోచనల్ని, చేయాల్సిన పనులను జాబితాగా చేసుకుని   రోజును చక్కగా ప్లాన్ చేసుకోండి. ఇది మీ పనులను సులభతరం చేస్తుంది. నేడు ఖర్చులు పెరగనున్నాయి. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన మేర ఫలితాలు రావు. కొన్ని పనులలో జాప్యం ఏర్పడుతుంది.

Also Read: Srisailam Brahmotsavalu: మహా శివరాత్రికి ముస్తాబవుతున్న శ్రీశైలం క్షేత్రం 

వృషభ రాశి
నేడు వృషభ రాశి వారు కొన్ని మార్పులు కోరుకుంటారు. మీకు అధిక సమయం పని చేయాలని ఉంటుంది. తద్వారా ఇతరులకు సంతోషాన్ని అందిస్తారు. అదే సమయంలో మీకు విశ్రాంతి కూడా అవసరమని గ్రహిస్తారు. మీకు ఇష్టమైన వారు లేదా స్నేహితులతో బయటకు వెళతారు. కొందరు కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది. నూతన ఉద్యోగ అవకాశాలు మీ తలుపు తట్టనున్నాయి.

మిథున రాశి
మీకు ఓ విషయంలో రెండు సమస్యలు ఎదురవుతాయి. ఎటు నిర్ణయం తీసుకోవాలో తేల్చుకోలేకపోతారు. ఈ మానస్థితి నుంచి మీరు వెంటనే బటయపడాలి. ప్రతి దానికీ లాభాలు మరియు నష్టాలు ఉంటాయని గ్రహించండి. ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. కొన్న పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతారు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాయి సూచిస్తున్నాయి. పని చేసేచోట ఉద్యోగులకు పనిభారం, ఒత్తిడి అధికం కానుంది.

కర్కాటక రాశి
మీరు అధిక భావోద్వేగాలకు లోనవుతారు. అయితే మీ పనిపై దృష్టి పెట్టడానికి మీ సమయాన్ని వెచ్చించడంతో ప్రయోజనాలు రాబట్టవచ్చు. ఇతరులు చేసిన దాని గురించి చింతించకండి. చేపట్టిన పనుల్లో జాప్యం తలెత్తుతుంది. కుటుంబం, బంధుమిత్రులతో స్వల్ప విభేదాలు గోచరిస్తున్నాయి. కొన్ని విషయాలు మిమ్మల్ని బాధిస్తాయి. ఖర్చులు అధికం కావడంతో ఉద్యోగులు, వ్యాపారులకు అంతగా కలిసిరాదు. 

Also Read: Astrology: కుంభరాశిలోకి శుక్రుడు ప్రవేశం, 12 రాశుల వారిపై దీని ప్రభావం ఇలా ఉండనుంది

సింహ రాశి
ఈ రోజు మీ సన్నిహిత సంబంధాలను జాగ్రత్తగా చూసుకుంటున్నారని భావిస్తారు. మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దవద్దు. అందుకు బదులుగా ఇతరులు చెప్పేది వినేందుకు యత్నిస్తే మీకు పరిష్కారం దొరకనుంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి. ప్రయాణాలు చేయాల్సి రావడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. పని చేసేవారికి, వ్యాపారం చేస్తున్న వారికి సైతం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.

కన్య రాశి
మీరు కొంతకాలంగా మీ జీవిత భాగస్వామితో సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నారు. కన్య రాశి వారు చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న ఓ శుభవార్త లేదా వస్తువు అందుకుంటారు. మీ ప్రేమను వ్యక్తం చేసే సమయం ఇది. అవతలి వ్యక్తి దానిని అంగీకరించడానికి వెనకడుగు వేస్తే చింతించకండి. వారి నిర్ణయాన్ని గౌరవించి ముందుకు సాగాలి. ఉద్యోగులు, వ్యాపారులకు కోరుకున్న ఫలితాలు అందుతాయి. కొన్ని పనులలో జాప్యం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండనుంది.

తులా రాశి
ఈరోజు తులా రాశి వారు ఏదో విషయంపై ఆసక్తి పెంచుకుంటారు. అయితే మరో కోణం చూడటం సైతం తెలుసుకోవాలి. ఏం జరిగినా చింతించకండి, కొద్దికాలం మాత్రమే ఈ మానసిక స్థితి. కొంతకాలమే ఉంటుందని గ్రహిస్తారు. అరోగ్యం క్షీణిస్తుంది. వ్యాపారులకు అంత లాభసాటిగా లేదు.

వృశ్చిక రాశి
మీరు ఒకేసారి చాలా రకాల పనులను చేపడతారు. ఒకేసారి కొన్ని బాధ్యతలు మీకు అప్పగిస్తారు. వాటి సమర్థవంతంగా నిర్వహించేందుకు మీ నైపుణ్యాలు సహాయ పడతాయి. ఆకస్మిక ధనలాభం సహా శుభవార్తలు సైతం అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 

Also Read: Maha Shivaratri 2021: మహా శివరాత్రి రోజున ఇలాచేస్తే పరమశివుడ్ని ప్రసన్నం చేసుకోవచ్చు

ధనుస్సు రాశి
కేవలం మీ విషయాలపై ఫోకస్ చేస్తారు. కానీ ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలని మరిచిపోరాదు. అనారోగ్య సమస్య బారిన పడతారు. రుచికరమైన కన్నా ఆరోగ్యాన్ని అందించే ఆహారాన్ని తీసుకోవాలి. ఉద్యోగులు, వ్యాపారులకు కొత్త సమస్యలు వేధిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది. ఖర్చులు అధికమై రుణాల కోసం యత్నిస్తారు.

మకర రాశి
మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. కానీ ఈరోజు ఇది ప్రదర్శించాల్సిన సమయం కాదు. కొన్ని విషయాలలో మీరు మితిమీరిన అనుభూతి చెందవచ్చు. మీరు కోరుకున్న వారితోనైనా మాట్లాడటానికి ప్రయత్నించండి. ఇది మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. శుభవార్తలు అందుకుంటారు. అదే సమయంలో ఆర్థిక సమస్యలు, ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి.

కుంభ రాశి
ఈ రోజు మీ ప్రేమ జీవితాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు మీ భాగస్వామితో కలిసి ఏకాంతంగా గడుపుతారు. చేపట్టిన పనులలో జయం సిద్ధిస్తుంది. దైవ దర్శనాలు సాధ్యం చేసుకుంటారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులు కాస్త అధికంగా శ్రమించాల్సి వస్తుంది.

మీన రాశి
కొన్ని విషయాలలో మార్పును కోరుకుంటున్నారు. కనుక మీ స్నేహితులతో కలిసి ఏదైనా యాత్రకు ప్లాన్ చేయండి. సరదాగా గడిపితే అన్ని ఒత్తిడులు దూరం అవుతాయి. దాంతో నూతన కార్యకమాలు ఉత్సాహంగా ప్రారంభించవచ్చు. ఉద్యోగులకు పనులలో విజయాన్ని అందుకుంటారు. ఏవైనా వస్తువులు పొందుతారు. కుటుంబసభ్యులు, సన్నిహితులతో సరదాగా సమయం గడుపుతారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News