Horoscope Today In Telugu: నేటి రాశి ఫలాలు 20 జూన్ 2021, Rasi Phalalu, వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు

Horoscope Today In Telugu 20 June 2021: మీ సహచరులకు సమస్యను వివరించి వారు అర్థం చేసుకునేలా చేయడంలో విజయం సాధిస్తారు. ఇతరులు తమ అభిప్రాయాలు తెలుపుతుంటే అడ్డపడకూడదని గ్రహిస్తారు. ఉద్యోగులకు పని భారం తగ్గనుంది. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 20, 2021, 09:39 AM IST
Horoscope Today In Telugu: నేటి రాశి ఫలాలు 20 జూన్ 2021, Rasi Phalalu, వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు

Horoscope Today 20 June 2021: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క రాశికి ఓ ప్రత్యేక లక్షణం ఉంటుంది. శ్రీ ప్లవ నామ సంవత్సరం జూన్ 20వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
మీ ఆకాంక్ష మేరకు ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మీ తెలివితేటలు అవసరమైన సమయంలో ప్రదర్శిస్తారు. ఇతరులు చేయలేని పనులను సైతం చాకచక్యంగా వ్యవహరించి పూర్తి చేస్తారు. నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది. వ్యాపారులు పెట్టుబడి చేయడానికి ముందడుగు వేయనున్నారు.

వృషభ రాశి
మీ సహచరులకు సమస్యను వివరించి వారు అర్థం చేసుకునేలా చేయడంలో విజయం సాధిస్తారు. ఇతరులు తమ అభిప్రాయాలు తెలుపుతుంటే అడ్డపడకూడదని గ్రహిస్తారు. ఉద్యోగులకు పని భారం తగ్గనుంది. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.

Also Read: Sai Baba madhyana aarati lyrics: షిర్డీ సాయి బాబా మధ్యాహ్న హారతి తెలుగు లిరిక్స్

మిథున రాశి
ఆర్థిక పరమైన విషయాలు తనిఖీ చేసుకుంటారు. వాస్తవాలను గ్రహించి మెసలుకోవడం ఉత్తమమని భావిస్తారు. రోజువారీ విషయాలపై ఫోకస్ చేయాలి. ఖర్చులు అధికం కావడంతో కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు. ప్రయణాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. 

కర్కాటక రాశి 
ఓ ఒప్పందం గురించి మీరు తీక్షణంగా ఆలోచిస్తారు. మీ ఖర్చులు ఈ సమయంలో అదుపు తప్పుతాయి. దాంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. డబ్బు సంపాదించే మార్గాలు అన్వేషిస్తారు. పనులు నత్త నడకన సాగడం చికాకు తెప్పిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరగడంతో ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు కష్టాలు తప్పవు. 

సింహ రాశి
ఈరోజు మీకు అంతా శుభాలు జరుగుతాయి. నేడు మీకు సానుకూల వాతావరణం గోచరిస్తుంది. మీ తోబుట్టువుల నుండి శుభవార్త అందుకుంటారు. పనిచేసే చోట ఉద్యోగులు కొన్ని రాజకీయాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులు ఈరోజు తమ అధ్యయనాలలో దృష్టిని కేంద్రీకరిస్తారు. విలువైనవి కొనుగోలు చేసే అవకాశం ఉంది.

కన్య రాశి
నేడు మీరు ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఖర్చుల కోసం ఇతరుల వద్ద రుణాలు తీసుకుంటారు. సహాయం చేసిన వారి పట్ల మీరు కృతజ్ఞతతో ఉండాలి. ఇతరులు మీకు తెలియజేసే విషయాలను జాగ్రత్తగా వినండి. ఉద్యోగులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి.

Also Read: Vinayak Chaturthi 2021: వినాయక చతుర్థి ఇవాళ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు తెలుసా ? 

తులా రాశి
నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది. నేడు కొన్ని విషయాలలో ఉద్వేగానికి లోనవుతారు. ఇతరులకు హామీ ఇవ్వడం మినహా వారితో అనుబంధాన్ని ఏర్పరుచుకోండి. వ్యాపారులకు ఆశించిన మేర లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు, ప్రాజెక్టులలో ముందడుగు వేయనున్నారు. 

వృశ్చిక రాశి 
మీరు, మీ బంధువులందరూ ఓ విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చినప్పుడు ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది. అయినప్పటికీ ఇంట్లో పూర్తిగా సానుకూల పరిస్థితి ఉంటుందని ఆశించకూడదు. కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తవాలను కప్పిపుచ్చడానికి లేదా దాటవేయడానికి ఎటువంటి కారణాలు లేవు. ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. 

ధనుస్సు రాశి
నేడు ధనుస్సు రాశి వారికి చాలా విషయాలలో కలిసొస్తుంది. మానసిక ప్రశాంతతను పొందుతారు. కొన్ని విషయాలలో విజయం సాధిస్తారు. కొంత సమయం ఎలా అద్భుతంగా ఉంటుందో మీరు గుర్తు చేసుకుంటారు. బయటకు వెళ్లి ఇతరులను నవ్విస్తారు. వారికి సంతోషాన్ని పంచే తత్వం మీది. కొన్ని విషయాలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది.

మకర రాశి
కొన్ని విషయాల కారణంగా మీరు భావోద్వేగానికి లోనవుతారు. నూతన వ్యక్తులతో పరిచయాలు కొత్త అవకాశాలకు దారితీస్తాయి. కొన్ని ప్రాజెక్టులు సకాలంలో పూర్తవుతాయి. మీరు ప్రతి విషయాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలు మీ నెత్తిన వేసుకోవడం అంత శ్రేయస్కరం కాదు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. 

Also Read: Mrigasira Karthi: మృగశిర కార్తె అంటే ఏమిటి, ఈ సమయంలో చేపలు తినడానికి కారణాలు ఇవే 

కుంభ రాశి
మీరు మరింత ఆకర్షణీయంగా ఉన్న ఇతర వ్యక్తులను కలుసుకుంటారు. వారితో ఉండాలని ఆలోచనలు మొదలవుతాయి. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది. అధికంగా శ్రమించినా ఫలితం అందుతుందా లేదా అని ఆరాటపడతారు. సన్నిహితుల నుంచి కొన్ని విషయాలలో తలనొప్పులు. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి.

మీన రాశి
ఈ రోజు మీ సమయాన్ని ఎలా గడపాలో ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ చేసిన విధంగా పనులు జరగకపోవడంతో ఆందోళన చెందుతారు. కొన్ని విషయాలను ఎప్పుడు బహిర్గతం చేయాలో నిర్ణయానికి వస్తారు. కొందరు వ్యక్తులకు సహాయం చేసేందుకు ఒప్పుకుంటారు. ఉద్యోగులకు అంతగా కలిసిరాదు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News