KCR Ramadan Wishes: రేపు ముస్లింల పవిత్ర పండుగ రంజాన్. ఈదుల్ ఫిత్ర్ పండుగ పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింలకు ఈదుల్ పిత్ర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని ముస్లింలు ఈదుల్ ఫిత్ర్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్ధనలతో అల్లా దీవెను పొందాలని కేసీఆర్ ఆకాంక్షించారు. రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం విధిగా ఆచరించే ఉపవాసం, దైవ ప్రార్ధనలు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. మానవ సేవ చేయాలనే సందేశాన్ని రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందన్నారు. గంగా జమునా తెహజీబ్‌కు తెలంగాణ ప్రతీక అని కేసీఆర్ అభివర్ణించారు. లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం..దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేసీఆర్ కొనియాడారు. ఎంత కష్టమైనా, నష్టమైనా రాష్ట్ర ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడి తీరుతుందన్నారు. లౌకికవాద విఘాత శక్తుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీల అభివృద్ధికి చిత్తశుద్దితో పని చేస్తున్నామన్నారు. ముస్లింల సంక్షేమానికి ప్రతియేటా భారీగా నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. షాది ముబారక్ పధకం ద్వారా ముస్లిం ఆడపిల్లల పెండ్లి ఖర్చులకై..1 లక్ష 116 రూపాయల సహాయం అందిస్తున్నామని గుర్తు చేశారు. ప్రతి పేద ముస్లిం ఆడపిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. మైనార్టీ యువతకు ప్రత్యేక శిక్షణనిచ్చి..స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని చెప్పారు. మైనార్టీ విద్యార్ధులకు గురుకులాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందిస్తుందన్నారు. ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్ ద్వారా ముస్లింల విదేశీ విద్యకు రాష్ట్ర ప్రభుత్వం బాటలు వేస్తోందన్నారు.
Also read: Dharani Portal: మంత్రివర్గ ఉపసంఘం రిపోర్ట్ .. ధరణి లోపాలకు చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook