Karthika Masam 2022: కార్తీక మాసం హిందూ పురాణాల ప్రకారం ఎంతో పవిత్రమైంది. కార్తీక మాస శుభ ఘడియల్లో మహా శివున్ని పూజిస్తారు. ముఖ్యంగా ఈ దివ్యమైన రోజులు దీపావళి తర్వాత వస్తాయి కాబట్టి ఈ క్రమంలో లక్ష్మిదేవిని కూడా కొలుస్తారు. అంతేకాకుండా ఉదయాన్నే 3 గంటలకు నిద్రలేచి ఆడపడుచులంతా భక్తిశ్రద్ధలతో దీపాలను వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు కూడా పొందుతారు. ఈ పవిత్రమైన మాసంలో కుటుంబంలో సుఖశాంతులు కలగాలని చాలామంది ఉపవాసాలు కూడా పాటిస్తారు. ఇక ఈ మాసం విషయానికి వస్తే అక్టోబర్ 26న ప్రారంభమై నవంబర్ 23న ముగుస్తుంది.
ఉదయాన్నే మహిళలు ఎందుకు దీపాలను వెలిగిస్తారు..?
ఈ పవిత్రమైన రోజుల్లో మహిళలందరూ ఉదయం 4 గంటలకే తల అంటుకొని స్నానం చేసి దగ్గరలో ఉండే దేవాలయాలని వెళ్లి ఉసిరి చెట్టు లేదా రావి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు. ఇలా దీపాలు వెలిగించడం వల్ల కుటుంబంలో ఆర్థిక సమస్యలు తొలగిపోయి. అంచలంచలుగా వృద్ధి చెందుతారని పూర్వీకులు గ్రంథాల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా కుటుంబంలో ఎదురయ్యే సమస్యలు తొలగిపోతాయని అందుకే ఉదయం పూట దీపాన్ని వెలిగిస్తారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే దీపం వెలిగించే క్రమంలో మహాలక్ష్మి అమ్మవారు తలుచుకుని మంత్రాన్ని పఠించి దీపం వెలిగించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.
దీపాలు వెలిగించే క్రమంలో ఏ నూనెను వాడాలి..?:
చాలామంది దీపాలను వెలిగించే క్రమంలో వివిధ రకాల నూనెలను వినియోగిస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం దీపాలతో కేవలం నువ్వులతో తయారు చేసిన నూనెను మాత్రమే వినియోగించాలని తెలిపారు. నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించి ఆలయంలోని దక్షిణం వైపున దీపాన్ని పెట్టడం వల్ల మంచి జరుగుతుందని శాస్త్రంలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆలయంలో ఉసిరి చెట్టు ఉంటే ఆ చెట్టు కింద కూడా ఒక దీపం వెలిగిస్తే మంచి ఫలితాలు పొందుతారు.
Also Read: Pranitha Subhash Latest Photoshoot : ప్రణీత.. ఏంటీ అందాల ఆరబోత.. తల్లైనా తగ్గేదేలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook