Chandra Grahanam 2023: చంద్రగ్రహణానికి, తులసికి ఉన్న సంబంధం ఏంటి?

Chandra Grahanam 2023: మరో వారం రోజుల్లో చివరి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది భారతదేశంలో కనిపిస్తుంది. ఈ సమయంలో కొన్ని పనులు చేయడం మంచిది కాదు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 20, 2023, 01:10 PM IST
Chandra Grahanam 2023: చంద్రగ్రహణానికి, తులసికి ఉన్న సంబంధం ఏంటి?

Lunar Eclipse 2023 date: ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఈ నెల చివరిలో ఏర్పడబోతుంది. ఇది అక్టోబరు 28న అంటే శరద్ పూర్ణిమ రోజున సంభవించనుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది. ఈ సంవత్సరం మనదేశంలో కనిపించబోయే ఏకైక గ్రహణం ఇది. భారత కాలమానం ప్రకారం, అక్టోబరు 28 అర్ధరాత్రి సమయంలో ఏర్పడబోతుంది. ఆ రోజు మధ్యాహ్నాం నుండే సూతక్ కాలం ప్రారంభమవుతుంది. ఈ సమయం శుభకార్యాలకు అశుభకరమైనదిగా భావిస్తారు. ఈ గ్రహణ కాలంలో కొన్ని నియమాలు పాటించడం చాలా ముఖ్యం. 

** చంద్రగ్రహణం సమయంలో తులసి మొక్కను ఎప్పుడూ తాకవద్దు. తులసిని పూజించవద్దు లేదా తులసికి నీరు పోయవద్దు. 
**చంద్రగ్రహణం సమయంలో ఆహారం మరియు నీరు మొదలైన వాటిలో తులసి ఆకులను వేసుకుని తినడం లేదా తాగడం వల్ల మీరు కాలుష్యం నుండి రక్షించబడతారు. తద్వారా గ్రహణ సమయంలో వెలువడే హానికరమైన కిరణాల వల్ల ఆహార పదార్థాలు చెడిపోకుండా ఉంటాయి. కానీ చంద్రగ్రహణం సమయంలో తులసికి సంబంధించిన కొన్ని పనులు పొరపాటున చేయకూడదు. దీని వల్ల తల్లి లక్ష్మి కోపించి తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుంది.
** గ్రహణ సమయంలో తులసి ఆకులను ముట్టుకునే పొరపాటు చేయవద్దు. గ్రహణానికి ముందు తులసి ఆకులను తెంచి ఉంచుకోవడం మంచిది కాదు. ఒకవేళ ఉంచుకుంటే వాటిని గ్రహణానికి ముందే ఆహారం లేదా నీటిలో వేయాలి. గ్రహణ సమయంలో తులసి ఆకులను కోయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది, తద్వారా మీకు ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. 

Also Read: Diwali 2023: దీపావళి రోజున ఈ వస్తువులను ఇంటికి తీసుకొస్తే.. ఏడాదంతా మీకు డబ్బే డబ్బు..

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News