Team India Eye on World No 1 ODI Ranking after New Zealand slipped to No 2 place: 2023లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా రెండో వన్డే సిరీస్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. జనవరి ఆరంభంలో స్వదేశంలో శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో గెలిచిన భారత్.. పటిష్ట న్యూజిలాండ్‌ను సైతం అద్భుత ఆటతో మట్టికరిపించింది. మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఖాతాలో వేసుకుంది. ఇక వరుస విజయాలతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి అడుగు దూరంలో నిలిచింది. సిరీస్‌ను కోల్పోయిన కివీస్ మాత్రం రెండో స్థానానికి పడిపోయింది.
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లీష్ జట్టు ఖాతాలో ప్రస్తుతం 113 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. న్యూజిలాండ్, భారత్ కూడా 113 పాయింట్లతో సంయుక్తంగా ఉన్నప్పటికీ.. కొద్దిపాటి తేడాతో 2, 3 స్థానాల్లో కొనసాగుతున్నాయి. 112 పాయిట్లతో ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో ఉండగా.. 106 పాయింట్లతో పాకిస్థాన్ ఐదో స్థానంలో ఉంది. ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో మంగళవారం జరగనున్న మూడో వన్డేలో భారత్ గెలిస్తే టాప్ ర్యాంక్ అందుకుంటుంది.
భారత్- న్యూజిలాండ్ రెండో వన్డేకు ముందు కివీస్ జట్టు 115 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. 111 పాయింట్లతో భారత్ ఐదో స్థానంలో కొనసాగేది. రెండో వన్డేలో న్యూజిలాండ్ ఓడిపోవడంతో ఆ జట్టు ఖాతాలో 2 పాయింట్లు కోత పడ్డాయి. మరోవైపు విజయం సాధించిన భారత్ ఖాతాలో 2 పాయింట్లు యాడ్ అయ్యాయి. దీంతో భారత్ మూడో స్థానంలోకి దూసుకు రాగా.. కివీస్ రెండో స్థానంకు పడిపోయింది. భారత్ విజయం సాధించడంతో ఇంగ్లండ్‌కు కలిసొచ్చింది. చివరి వన్డేలో భారత్ విజయం సాధిస్తే అగ్రస్థానంలోకి వెళుతుంది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌నూ రోహిత్ సేన సొంతం చేసుకొంటే.. టెస్ట్ ఫార్మాట్‌లోనూ అగ్రస్థానంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
న్యూజిలాండ్‌పై డబుల్ సెంచరీ చేసిన శుభ్‌మన్ గిల్ ఏకంగా పది ర్యాంక్‌లు ఎగబాకి.. 26వ స్థానంలోకి దూసుకొచ్చాడు. గిల్ ఖాతాలో 624 పాయింట్లు ఉన్నాయి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (750) నాలుగు స్థానాలను మెరుగుపర్చుకొని.. నాలుగో స్థానంలోకి వచ్చాడు. టీ20ల్లో మాత్రం మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. సూర్య ఖ్తలో 908 పాయింట్లు ఉన్నాయి. ఇప్పటివరకు ఏ భారత ఆటగాడు కూడా 908 పాయింట్లు సాధించలేదు. దాంతో సూర్యకుమార్ రికార్డుల్లోకి ఎక్కాడు.
Also Read: నా బయోపిక్ తీస్తే ఊరుకునేది లేదు.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు! కలల ప్రాజెక్ట్ అంటూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
India ICC ODI Ranking: న్యూజిలాండ్‌పై మూడో వన్డేలో గెలిస్తే.. టీమిండియాదే అగ్రస్థానం!
న్యూజిలాండ్‌పై మూడో వన్డేలో గెలిస్తే
టీమిండియాదే అగ్రస్థానం
రెండో స్థానానికి న్యూజిలాండ్