Lord Vishnu: గురువారం ఈ పరిహరాలు చేయండి.. శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో అంతులేని సంపదను పొందండి!

Lord Vishnu: గురువారం శ్రీమహావిష్ణువును పూజిస్తారు. మీ జీవితంలోని సమస్యల నుండి బయటపడాలంటే గురువారం ఈ పరిహారాలు చేయండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 28, 2022, 02:08 PM IST
Lord Vishnu: గురువారం ఈ పరిహరాలు చేయండి.. శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో అంతులేని సంపదను పొందండి!

Thursday Remedies: హిందువులు వారంలో ఒక్కోరోజు ఒక్కోదేవతను పూజిస్తారు. గురువారం నాడు శ్రీమహావిష్ణువును పూజిస్తారు.  ఇవాళ శ్రీహరిని (Lord Vishnu) ఆరాధిస్తే.. అతనితోపాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈరోజు ఇంట్లోని పెద్దలను  పూజించడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఈ రోజు శ్రీహరితోపాటు సాయిబాబా మరియు బృహస్పతిని కూడా పూజిస్తారు.  ఈ రోజు బృహస్పతికి పూజలు చేయడం వల్ల మీ జాతకంలో అతడు బలపడతాడు. తద్వారా మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. మీరు ఆర్థికంగా ఇబ్బందులు నుండి బయటపడాలంటే..గురువారం ఈ పరిహారాలు (Thursday Remedies) చేయండి. 

గురువారం రోజు ఈ పరిహారాలు చేయండి
>> హిందూ గ్రంధాల ప్రకారం, గురువారం విష్ణువుకు అంకితం చేయబడింది. ఈరోజున నారాయణుడిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. దీంతో మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.  

>> గురువారం నాడు శ్రీమహావిష్ణువును పూజించేటప్పుడు పసుపు బట్టలు ధరించాలి. అంతేకాకుండా పూజా సామగ్రిలో పసుపు చందనం ఉపయోగించాలి. దీంతో విష్ణువు సంతోషించి ప్రజల కోరికలన్నీ తీరుస్తాడు. అంతే కాకుండా ఈ రోజు దానం చేయడం వల్ల కూడా విశేష ప్రయోజనాలను పొందవచ్చు.  

Also Read: Budha Sancharam 2022: రాశిని మార్చబోతున్న బుధుడు.. ఆగస్టు 1 నుండి మారబోతున్న ఈ రాశుల ఫేట్! 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News