Chandra Grahan 2023 Date: చివరి చంద్ర గ్రహణం ఎప్పుడు, మన దేశంపై దీని ప్రభావం తెలుసుకోండి..

Lunar Eclipse 2023: ఈ ఏడాది రెండో లేదా చివరి చంద్రగ్రహణం అక్టోబరులో సంభవించబోతుంది. ఇది పాక్షిక చంద్రగ్రహణం. ఈ గ్రహణ సమయంలో కొన్ని పనులు చేయడం నిషిద్ధం. మరి ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందో లేదో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 20, 2023, 03:57 PM IST
Chandra Grahan 2023 Date: చివరి చంద్ర గ్రహణం ఎప్పుడు, మన దేశంపై దీని ప్రభావం తెలుసుకోండి..

Chandra Grahan 2023 Date time in India:  సూర్య, చంద్ర గ్రహణాలను ఖగోళ సంఘటనలుగా భావిస్తారు. హిందు గ్రంధాలలో గ్రహణాన్ని అశుభకరమైనదిగా పరిగణిస్తారు. అందుకే సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం ఏర్పడినప్పుడల్లా, దాని సూతక కాలం కొన్ని గంటల ముందు ప్రారంభమవుతుంది. ఈ సూతక్ కాల లేదా గ్రహణ సమయంలో ఎటువంటి శుభకార్యాలు, పూజలు లేదా ముఖ్యమైన పనులు చేయరు. ఈ ఏడాది రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. ఇప్పటికే ఒక సూర్యగ్రహణం, ఒక చంద్రగ్రహణం సంభవించాయి. ఈ సంవత్సరం రెండో లేదా చివరి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడబోతుందో తెలుసుకుందాం. 

చంద్రగ్రహణం ఎప్పుడు?

2023లో రెండవ మరియు చివరి చంద్రగ్రహణం అశ్వినీ అమవాస్య రోజు ఏర్పడబోతుంది. ఇది అక్టోబర 28నాడు రాత్రి 1:06 గంటలకు ప్రారంభమై 2:22 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం వ్యవధి 1 గంట 16 నిమిషాలు. ఇప్పుడు ఏర్పడబోయేది పాక్షిక చంద్రగ్రహణం. ఇది భారతదేశంలో కనిపించనుంది. దీని సూతక్ కాలం కూడా చెల్లుతుంది. చంద్రగ్రహణం యొక్క సూతక కాలం 9 గంటల ముందు ప్రారంభమవుతుంది.

Also Read: Budh Asta 2023 Date: బుధుడి అస్తమయంతో మారిన ఈ రాశుల అదృష్టం, ఇక వీరికి తిరుగుండదు..

మన దేశంలో కనిపిస్తుందా?

ఈ గ్రహణం భారతదేశంతోపాటు యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్రం, అంటార్కిటికా, ఆర్కిటిక్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, హిందూ మహాసముద్రం మరియు ఆఫ్రికాలో కనిపిస్తుంది. ఇది గ్రహణం మెుత్తం 12 రాశిచక్రాలపై ప్రభావం చూపుతుంది. ఈ చంద్రగ్రహణం సమయంలో ఎటువంటి ప్రయాణాలు చేయకండి. ఇంట్లో పూజ గదితలుపులు మూసి ఉంచండి. గర్భిణీలు తగు జాగ్రత్తలు తీసుకోండి. 

Also Read: Mars transit 2023: సూర్యుని రాశిలోకి కుజుడు... ఈ 4 రాశులకు లక్కే లక్కు.. లాభాలే లాభాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News