Mangal Gochar 2022: జ్యోతిషశాస్త్రం ప్రకారం, వివాహం, భూమి మరియు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు అంగారకుడు. జాతకంలో కుజుడు శుభ స్థానంలో ఉంటే ఆ వ్యక్తికి దేనికీ లోటు ఉండదు. నవంబరు 13న మార్స్ గ్రహం వృషభరాశిలోకి (Mars Transit In Taurus 2022) ప్రవేశించింది. మార్చి 13 వరకు అంటే 120 రోజులపాటు కుజుడు అదే రాశిలో ఉంటాడు. దీంతో మూడు రాశులవారు భారీ మెుత్తంలో డబ్బును పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మార్స్ సంచారం ఈ రాశులకు అనుకూలం
మకరరాశి (Capricorn): మకర రాశిలో కుజుడు సంచారం మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఉద్యోగానికి కూడా సమయం అనుకూలంగా ఉంటుంది. పిల్లల నుండి కొన్ని శుభవార్తలు అందుకుంటారు. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది.
వృషభం (Taurus): కుజుడు తన రాశిని మార్చుకుని వృషభరాశిలోకి ప్రవేశించాడు. దీంతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భాగస్వామ్యంతో పనిచేసే వ్యక్తులు విశేష ప్రయోజనాలను పొందుతారు. దీని కారణంగా ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆర్థిక స్థితి బలపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. వివాహం కుదిరే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
మేషం (Aries): మేషరాశి వారికి అంగారక సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కుజుడు మేషరాశిని వదిలి వృషభరాశిలోకి ప్రవేశించాడు. మార్చి 2023 వరకు, మేషరాశి వారికి కుజుడు చాలా ప్రయోజనాలను ఇస్తాడు. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది.
Also Read: Guru Margi 2022: ఈరోజు నుంచి లాభాలు పొందబోయే రాశువారు వీరే.. మీది కూడా ఈ రాశేనా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook