Mars transit 2024: జ్యోతిష్యం ప్రకారం మంగళ గ్రహం మకర రాశిలో ప్రవేశించడం వల్ల రుచక్ రాజయోగం ఏర్పడనుంది. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశించడం వల్ల అప్పటికే రాశిలో ఉన్న ఇతర గ్రహాలతో కలిసి శుభ, అశుభ రాజయోగాలు ఏర్పరుస్తుంటాయి. ఇవి ఒక్కో రాశిపై ఒక్కోలా ఉంటాయి.
హిందూ జ్యోతిష్యం ప్రకారం శుభప్రదమైన కార్యాలకు ప్రతీకగా భావించే మంగళ గ్రహం మకర రాశిలో ప్రవేశించనున్నాడు. ఫలితంగా రుచక రాజయోగం ఏర్పడనుంది. ఈ రాజయోగం ప్రభావం మొత్తం 12 రాశులపై పడుతుంటుంది. ముఖ్యంగా 3 రాశుల జీవితాలపై అత్యద్భుతంగా ఉంటుంది. ఊహించని ధనలాభం కలుగుతుంది. చేపట్టిన ప్రతి పని పూర్తవుతుంది. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఈ మూడు రాశుల జీవితమే మారిపోనుంది.
వృషభ రాశి జాతకులకు రుచక రాజయోగం కారణంగా ఊహించని లాభాలు కలగనున్నాయి. మంగళ గ్రహం మకర రాశి 9వ భాగంలో గోచారం చేయనుండటంతో అదృష్టం తోడుగా ఉంటుంది. వ్యాపార విషయాల్లో అన్నీ అనుకూలిస్తాయి. విద్యార్ధులకు విదేశాల్లో చదువుకోవాలనే కోరిక సిద్ధిస్తుంది. ఇంట్లో కుటుంబసభ్యుల్నించి పూర్తి సహకారం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అదృష్టం తోడుగా ఉండటం వల్ల అన్ని పనుల్లో విజయం మీదే అవుతుంది. ఉద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు, పదోన్నతి లభిస్తుంది.
తుల రాశి జాతకులకు ఈ సమయంలో అంతా సానుకూల పరిణామాలు ఎదురౌతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరగడమే కాకుండా ఊహించని ధన సంపదలు వచ్చి పడతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం సిద్ధిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాల వల్ల ఆదాయం పెరుగుతుంది. అటు హోదా కూడా పెరుగుతుంది. వ్యాపారులు అమితమైన లాభాలు ఆర్జిస్తారు. కొత్త ఇళ్లు లేదా వాహనం కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
మంగళ గ్రహం మకర రాశిలో ప్రవేశించడం వల్ల రుచక రాజయోగం ప్రభావంతో ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. వ్యాపారులకు చాలా మంచి సమయం. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ప్రాపర్టీ, భూమి సంబంధిత విషయాల్లో లాభం కలుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతి ఉంటుంది. నిరుద్యోగులకు అద్భుతమైన అవకాశాలుంటాయి. వృత్తిపరమైన జీవితంలో ఎదుగుదల స్పష్టంగా కన్పిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త అవసరం.
Also read: Sun Transit 2023: జనవరి 14 వరకూ ఈ మూడు రాశులకు పట్టిందల్లా బంగారమే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook