Nagula Chavithi: కార్తీక మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో నాగుల చవితి ఒకటి. మన పురాణాల్లో నాగజాతికి చెందిన దేవతలను పూజించడం అనేది ఆనవాయితీ. అందుకు తగ్గట్టుగానే  మన పురాణాల్లో దేవతలకు నాగుపాము కు ఎంతో అనుబంధం ఉంది శ్రీమహావిష్ణువు శయనించేది శేషతల్పం పైనే, అంటే పావు పడగ నీడన శ్రీమహావిష్ణువు పాలకడలిపై శయనిస్తాడు. 

శ్రీమహావిష్ణువుకు ఆదిశేషువు అనే సర్పరాజు శేష తల్పంగా ఉన్నారు. అలాగే పరమశివుడికి సైతం మెడలో కంఠాభరణం గా హాలాహలాన్ని గరళంలో నిలిపేలా చేసింది కూడా నాగరాజా కావడం విశేషం. మన సనాతన ధర్మంలో నాగుపాముకు ఎంతో పేరుంది. సనాతన జీవన విధానంలో ప్రకృతిలోని అనేక జీవజాతులకు ప్రాధాన్యత ఉంది. ఆవు నుంచి సర్పం వరకు ఇలా అనేక జంతు జీవ జాలాలను మన పూర్వీకులు ఆరాధిస్తున్న సంగతి తెలిసిందే. 

అలాగే నాగ జాతి కోసం నాగ లోకం కూడా ఉంది. అలాంటి నాగజాతిని ఆరాధించే విశిష్టమైన పర్వదినమే నాగుల చవితి. దీపావళి పండగ అమావాస్య అనంతరం కార్తీక మాసం శుద్ధ చవితి నాడు ఈ నాగుల చవితి పండుగను నిర్వహించుకుంటారు. ఈ రోజున ముఖ్యంగా మహిళలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి తమ ఇంటి సమీపంలో ఉండే పుట్ట వద్దకు చేరుకొని అక్కడే నాగుపాముల కోసం పుట్టలో పాలు పోస్తారు. అలాగే నాగదేవత కోసం ఒక పూట ఉపవాసం ఉంటారు. 

Also Read: Gold News Today: తగ్గేదెలే అంటున్న బంగారం..82 వేలు దాటిన తులం పసిడి

నాగుల చవితిని తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎంతో అంగరంగ వైభవంగా చేస్తారు. అయితే ఈ సంవత్సరం నాగుల చవితి విషయంలో ఒక ధర్మ సంకటం ఏర్పడింది నాగుల చవితి ఎప్పుడు నిర్వహించుకోవాలి అనే డౌట్ ప్రతి ఒక్కరికి రావచ్చు. ఈసారి క్యాలెండర్లో నాగుల చవితి నవంబర్ 4వ తేదీ నిర్వహించుకోవాలని కొంత మంది చెబుతుంటే, మరికొందరు మాత్రం నవంబర్ ఐదునే నిర్వహించుకోవాలని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. 

నాగుల చవితి పండుగను శాస్త్ర ప్రకారం చవితి రోజున జరుపుకోవాలి కార్తీక శుద్ధ చవితి రోజు నాగుల చవితి పండగ జరుపుకోవాలని శాస్త్రం చెబుతోంది నవంబర్ 4వ తేదీ రాత్రి 8 గంటలకు చవితి ప్రారంభం అవుతోంది. ఆ తర్వాత నవంబర్ 5 సూర్యోదయం వేళ చవితి తిథి ఉంటుంది. ఇది రాత్రి 8. 56 నిమిషాల వరకు ఉంటుంది. ఈ లెక్కన చూస్తే సూర్యోదయం నుంచి సంధ్యా సమయం వరకు చవితి తిధి ఉన్న నేపథ్యంలో నవంబర్ 5వ తేదీ ఇదే నాగుల చవితి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

Also Read:Diwali Muhurat Trading: నేడే ముహూరత్ ట్రేడింగ్.. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి..? దివాలి మార్కెట్ సెంటిమెంట్ ఇదే

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

English Title: 
Nagula Chavithi 2024 When should Nagula Chavithi be celebrated on November 4 or November 5
News Source: 
Home Title: 

Nagula Chavithi 2024: నాగుల చవితి ఎప్పుడు నవంబర్ 4న లేక నవంబర్ 5న జరుపుకోవాలా..? పండితులు ఏం చెబుతున్నారు
 

Nagula Chavithi 2024: నాగుల చవితి ఎప్పుడు నవంబర్ 4న లేక నవంబర్ 5న జరుపుకోవాలా..? పండితులు ఏం చెబుతున్నారు
Caption: 
Nagula Chavithi 2024
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
నాగుల చవితి ఎప్పుడు నవంబర్ 4న లేక నవంబర్ 5న జరుపుకోవాలా..? పండితులు ఏం చెబుతున్నారు
Bhoomi
Publish Later: 
No
Publish At: 
Friday, November 1, 2024 - 17:34
Created By: 
Madhavi Vennela
Updated By: 
Madhavi Vennela
Published By: 
Madhavi Vennela
Request Count: 
1
Is Breaking News: 
No
Word Count: 
316

Trending News