Navratri 2022: శారదీయ నవరాత్రులు ఈ రోజు (26 సెప్టెంబర్ 2022) నుంచి ప్రారంభమవుతాయి. అయితే ఈ క్రమంలోభక్తులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు. అయితే పూజలో భాగంగా పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా దుర్గ మాతకు ఎంతో ఇష్టమైన గోధుమ విత్తనాలకు ఎంతో ప్రముఖ్యత ఉంది. అయితే దుర్గపూజలో భాగంగా కలశం పెట్టే క్రమంలో పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా దుర్గపూజలో భాగంగా కలశాన్ని అమర్చి వాటి వద్ద విత్తనాలు నాటాల్సి ఉంటుంది. ఇవి సమాజంలో ఆటుపోట్లు పెరిగినప్పుడు శుభ, అశుభ సంకేతాలు సూచిస్తాయి.
నవరాత్రులలో గోధుమ విత్తనాల ప్రముఖ్యత:
నవరాత్రి ఘటస్థాపన ముహూర్తం:
ఘటస్థాపన నవరాత్రుల ప్రతిపాదన తేదీలో జరుగుతుంది. కలశ స్థాపనలో బార్లీని విత్తడం చాలా పవిత్రమైనదిగా శాస్త్రం పేర్కొంది. గోధుమ బ్రహ్మాజీకి చిహ్నంగా శాస్త్రం తెలుపుతోంది. అయితే వాటిని పూజించడం వల్ల నవరాత్రుల పూజలు సఫలమవుతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంవత్సరం ఘటస్థాపన శుభ సమయం 26 సెప్టెంబర్ 2022 ఉదయం 6.17 నుంచి 07.55 వరకు ఉంది.
బార్లీ విత్తడం యొక్క ప్రాముఖ్యత:
నవరాత్రులలో ఈ గింజలను విత్తడం వెనుక ఒక నమ్మకం ఉంది. ఇది సృష్టి యొక్క మొదటి పంట కాబట్టి వీటిని తప్పకుండా పూజలో భాగంగా వీటిని విత్తుకోవడం చాలా మంచిదని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. గోధుమలు అన్నపూర్ణాదేవికి చిహ్నంగా శాస్ర్తం పరిగణిస్తోంది. నవరాత్రి పండుగ చాలా పవిత్రమైనది కాబట్టి తప్పకుండా ఈ విత్తనాలను విత్తడం వల్ల దుర్గాదేవి, అన్నపూర్ణ మాత ఆశీస్సులు లభిస్తాయి.
ఈ గింజలను ఎందుకు విత్తుతారు:
బార్లీ విత్తడం చాలా సంవత్సరాలుగా కొనసాగుతోంది. నవరాత్రులలో మొదటి రోజున దీనిని మట్టి కుండలో విత్తుతారు. అవి పెరిగే కొద్దీ ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు పెరుగుతాయని భక్తులు నమ్ముతారు.
గోధుమ గింజల శుభ సంకేతాలు:
గోధుమ గింజలను పద్దతిగా విత్తినట్లయితే.. అది శుభ సంకేతాలను ఇస్తుందని శాస్త్రం చెబుతోంది. నవరాత్రుల ప్రారంభంలో ఇవి మొలకెత్తడం ప్రారంభిస్తే.. అది శుభసూచకంగా పరిగణించబడుతుంది. బార్లీ తెలుపు లేదా ఆకుపచ్చ రంగులో పెరిగితే.. అది పెరుగుతున్న ఆనందం, అదృష్టానికి సంకేతంగా చెప్పొచ్చు.
బార్లీ అననుకూల సంకేతాలు:
నవరాత్రి తొమ్మిది రోజులలో కూడా బార్లీ పెరగకపోతే.. లేదా పసుపు రంగులోకి మారితే, అది రాబోయే కాలంలో ఏదైనా పెద్ద సమస్యకు సంకేతంగా మారే అవకాశాలున్నాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook