Numerology: ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు 200 రోజులపాటు డబ్బు, పరపతి పొందబోతున్నారు..

 Numerology Calculator: జూన్ 29వ తేదీన శని కుంభరాశిలో తీరుగమనం చేయబోతోంది. అయితే ఈ తిరోగమన ప్రభావం దాదాపు 200 రోజులపాటు ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం ఈ సమయం కొన్ని అంకెల్లో జీవించిన వ్యక్తులకు చాలా శుభ్రంగా ఉంటుంది. 

Last Updated : Jun 29, 2024, 09:52 AM IST
Numerology: ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు 200 రోజులపాటు డబ్బు, పరపతి పొందబోతున్నారు..

 

 Numerology Calculator: జ్యోతిష్య శాస్త్రం అనేది తొమ్మిది గ్రహాలతో పాటు 12 రాశుల పై ఆధారపడి ఉంటుందని అందరికీ తెలిసిందే అయితే ఇందులో భాగంగా 27 నక్షత్రాలు కూడా కీలకపాత్ర పోషిస్తాయి. అలాగే జ్యోతిష్య శాస్త్రంలో అన్నిటికంటే ఎక్కువగా గ్రహాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే గ్రహం రాశి మారినప్పుడల్లా ప్రత్యేకమైన ప్రభావం పడుతూ ఉంటుంది. అయితే 9 గ్రహాల్లో ఎక్కువగా శని గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాకుండా ఈ గ్రహాన్ని కీడు గ్రహంగా కూడా పరిగణిస్తారు. ఈ శని గ్రహం సంచారం చేసినప్పుడల్లా మొత్తం 12 రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. అందుకే శని సంచారం, తిరుగమనం, సంయోగాన్ని కూడా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఎంతో కీలకమైంది గా భావిస్తారు.

ఇదిలా ఉంటే ఎంతో శక్తివంతమైన శని గ్రహం జూన్ 29న కుంభరాశిలో తిరుగమనం చేయబోతోంది. ఈ తిరోగమన ప్రారంభం మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ గ్రహం తిరోగమనం దాదాపు 200 రోజులపాటు చేయబోతోంది. అయితే శని గ్రహం తీరోగమనంతో కొన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. అంతేకాకుండా మరికొన్ని రాశుల వారికి శని అనుగ్రహం కలిగి విపరీతమైన లాభాలు కలుగుతాయి. ఇదిలా ఉంటే సంఖ్యాశాస్త్రం పరంగా చూసుకుంటే.. శని తిరుగమనం చేయడం కారణంగా కొన్ని అంకెల్లో జీవించిన వ్యక్తులకు విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అయితే ఏయే సంఖ్యలో జీవించిన వ్యక్తులకు శని అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకోండి.

ప్రమాణం 5:
న్యూమరాలజీ లెక్కల ప్రకారం ప్రమాణం ఐదు లో అంటే 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారికి జూన్ 29వ నుంచి శని అనుగ్రహం కలుగుతుంది. వీరు దాదాపు 200 రోజుల కంటే ఎక్కువగా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే వీరికి ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధించగలిగే శక్తిని కూడా పొందుతారు ముఖ్యంగా ప్రేమ జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది అలాగే అనుకున్న పనులు కూడా ఎంతో తొందరగా జరిగిపోతాయి.

ప్రమాణం 6: 
సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రమాణం 6 లో జీవించిన వ్యక్తులకు కూడా మార్చి 25వ తేదీ వరకు శని దేవుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది ముఖ్యంగా 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారికి అనుకున్న కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయి. దీంతోపాటు మీ భాగస్వాములు కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. అయితే ఉద్యోగాలు చేసేవారు ప్రాజెక్టుల కోసం విదేశాలు లేదా దూర ప్రయాణాలు చేసే ఛాన్స్ కూడా ఉంది. దీంతోపాటు ఆహారపు విషయాల్లో తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్ కూడా ఉంది.

ప్రమాణం 7: 
ప్రమాణం 7 లో జీవించిన వ్యక్తులకు కూడా శనితీ రోగమనం కారణంగా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా 16, 25వ తేదీల్లో జన్మించిన వ్యక్తులకు భవిష్యత్తు చాలా బాగుంటుంది అంతేకాకుండా ఉద్యోగాలు వ్యాపారాల్లో ఎలాంటి పనులు చేసిన ఎంతో సులభంగా విజయాలు సాధించగలుగుతారు దీంతోపాటు ఉద్యోగాల నిమిత్తం హార్డ్ వర్క్ చేయడం వల్ల ప్రమోషన్స్ కూడా పొందుతారు. అనారోగ్య సమస్యలతో బాధపడే వారి ఈ సమయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉండబోతోంది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News