Rahu And Ketu: రాహు-కేతువు నక్షత్ర సంచారం..ఈ రాశులవారికి డబ్బుల వర్షమే..

Rahu Ketu Gochar 2024: రాహు-కేతువు గ్రహాలు నక్షత్ర సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలిగే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు వ్యాపారాల్లో మార్పులు కూడా వస్తాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2024, 09:00 AM IST
Rahu And Ketu: రాహు-కేతువు నక్షత్ర సంచారం..ఈ రాశులవారికి డబ్బుల వర్షమే..

 

Rahu And Ketu Transit Effect On 3 Zodiac Signs: జ్యోతిషశాస్త్రంలో రాహు-కేతుల స్థానాన్ని చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఈ రెండు గ్రహాలు కేవలం కొన్ని ప్రత్యేక సమయాల్లో మాత్రమే సంచారం చేస్తాయి. అంతేకాకుండా ప్రతి 15 నెలలకు ఒక సారి మాత్రమే ఈ గ్రహాలు రాశులు మారుతాయి.  ఈ రాహు-కేతువు గ్రహాలు వక్ర స్థితిలో కదులుతాయి. ప్రస్తుతం రాహువు మీనరాశిలో, కేతువు కన్యారాశిలో ఉన్నాయి. అయితే ఈ గ్రహాలు 2024లో నక్షత్ర సంచారం చేయబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  జనవరి 1న రాహువు రేవతీ నక్షత్రంలోని తృతీయ దశలోకి సంచారం చేయగా..కేతువు చిత్ర మొదటి దశలో సంచారం చేసింది. ఈ మార్పుల కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. ఈ రెండు గ్రహాలు నక్షత్రాలు సంచారం చేయడం కారణంగా ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

మేషరాశి:
రాహు-కేతువు గ్రహాలు నక్షత్ర సంచారం చేయడం వల్ల మేష రాశివారికి వైవాహిక జీవితంలో సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి.  మీ భాగస్వామితో సంబంధం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు కలుగుతాయి. దీంతో ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. భాగస్వామి సపోర్ట్‌ లభించి..జీవితంలో ఆనందం నెలకొంటుంది. 

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

వృషభ రాశి:
వృషభ రాశివారికి ఈ రెండు గ్రహాల నక్షత్ర సంచారం కారణంగా చాలా రకాల లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వీరి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఈ రాశివారికి కొత్త ఆదాయ వనరులు లభించి, విపరీతంగా సంపాదిస్తారు. అలాగే 2024లో వీరు ధనవంతులయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వృషభ రాశి వారికి ఈ సమయంలో జీవితం ఎంతో ఆనందంగా మారుతుంది. వీరు పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. దీంతో పాటు కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పొందే ఛాన్స్‌లు ఉన్నాయి.

తులారాశి:
రాహువు, కేతువు గ్రహాల కలయిక కారణంగా 2024లో తులారాశి వారు విపరీతమైన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా మునుపటి కంటే చాలా వరకు మెరుగుపడతాయి. అంతేకాకుండా శత్రువులను జయించి తిరుగులేని విజయాలు కూడా సాధిస్తారు. కొత్త పనులు ప్రారంభించేందుకు ఇది సరైన సమయంగా భావించవచ్చు. అలాగే కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. 

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News