Rahu Gochar 2023 : రాహు ప్రభావం.. ఈ జాతకాల్లో పెను మార్పులు.. లక్ అంటే వారిదే 

Rahu Gochar 2023 రాహు సంచారం వల్ల కలిసి శుభ పరిణామాలు, అశుభాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అయితే మిథున, మీనం, మేషం వంటి కొన్ని రాశుల వారికి శుభాలు కలగబోతోన్నాయట.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 28, 2022, 02:52 PM IST
  • వచ్చే ఏడాదిలో రాహు గోచార్
  • ఈ రాశుల వారికి శుభపరిణామం
  • డబ్బు, వ్యాపారాల్లో పాజిటివ్ సైన్
Rahu Gochar 2023 : రాహు ప్రభావం.. ఈ జాతకాల్లో పెను మార్పులు.. లక్ అంటే వారిదే 

Rahu Gochar 2023 : జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఒక గ్రహం తన మార్గాన్ని, స్థానాన్ని  మార్చుకోవడం వల్ల దాని ప్రభావం అన్ని రాశుల మీద ఉంటుంది. అయితే ఆ ప్రభావం వల్ల కొందరికి మంచి జరగొచ్చు.. ఇంకొందరికి చెడు జరగొచ్చు. 2023 సంవత్సరంలో చాలా గ్రహాలు తమ స్థానాలను మార్చుకోబోతున్నాయి. దీంట్లోకి రాహువు కూడా ఉన్నాడు. 2023వ సంవత్సరంలో అక్టోబర్ 30న రాహువు మేషరాశి నుండి బయటకు వెళ్లి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని వల్ల ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూద్దాం.

మీన రాశి వారికి ఈ రాహు సంచారం వల్ల మంచి జరగబోతోంది. డబ్బు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. వారి వారి రంగాల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు లభించడం, వారితో సంబంధాలు మెరుగుపడటం వంటివి జరుగుతాయి. ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది.

రాహు సంచారం వల్ల కలిగే ప్రయోజనాలు వృశ్చిక రాశి వారిలోనూ కనిపిస్తాయి. కొత్త అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు కూడా ఈ కాలంలో మంచి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే అది సరైన సమయం.

కర్కాటక రాశి వారికి కూడా మేలు జరుగుతుందని తెలుస్తోంది. కొత్త ఆదాయ వనరులను పొందుతారు. డబ్బు కొరత తొలగిపోతుంది. స్నేహితుల మద్దతు లభిస్తుంది. పనులు పూర్తవుతాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రమకు తగ్గ ఫలితాలు పొందుతారు.

మిథున రాశి వారికి రాకపోకలు ఫలవంతంగా ఉంటాయి. సమాజంలో గౌరవం పొందుతారు. పనుల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్ పొందే అవకాశం కూడా ఉంది.

మేష రాశి వారికి అన్ని రంగాలలో విజయాలు లభిస్తాయి. స్నేహితుల సహకారం అందుతుంది. ప్రమోషన్ అందుతుంది. వ్యాపారాల్లో భారీ లాభాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. పెట్టుబడికి అది మంచి సమయం.

Also Read : Actor Thiruveer : ఐదారు టేక్స్ తీసుకున్నా.. సినిమా ఆఫర్ రాదనుకున్నా.. మసూదపై తిరువీర్ కామెంట్స్

Also Read : Shruti Haasan without Makeup : మేకప్ లేకపోతో ఇలా ఉంటుందా?.. శ్రుతి హాసన్‌ అలా అయిపోవడానికి కారణాలివేనట

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News