Shruti Haasan without Makeup : మేకప్ లేకపోతో ఇలా ఉంటుందా?.. శ్రుతి హాసన్‌ అలా అయిపోవడానికి కారణాలివేనట

Shruti Haasan without Makeup శ్రుతి హాసన్ తాజాగా విత్ అవుట్ మేకప్ ఫోటోలను షేర్ చేసింది. వాటిని చూసి జనాలు ఆమెకు ఏమై ఉంటుంది?అని కంగారు పడసాగారు. తనకు ఒంట్లో బాగా లేదని అసలు విషయాన్ని చెప్పేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 28, 2022, 09:47 AM IST
  • నెట్టింట్లో శ్రుతి హాసన్ సందడి
  • అనారోగ్యంతో బాధపడుతున్న హీరోయిన్
  • ఫీవర్, పీరియడ్స్, సైనస్ అంటూ శ్రుతి హాసన్ పోస్ట్
Shruti Haasan without Makeup : మేకప్ లేకపోతో ఇలా ఉంటుందా?.. శ్రుతి హాసన్‌ అలా అయిపోవడానికి కారణాలివేనట

Shruti Haasan without Makeup : శ్రుతీ హాసన్ ప్రస్తుతం ఓ పోస్ట్ వేసింది. అందులో తాను ఎలాంటి పరిస్థితులో ఉన్నాననో వివరించింది. శ్రుతీ హాసన్ అందులో మేకప్ లేకుండా కనిపించింది. అలా ఒక్కసారిగా కనిపించడంతో శ్రుతీ హాసన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే అలా కనిపించడానికి ఓ కారణం కూడా ఉందని చెప్పుకొచ్చింది. తాను జ్వరంతో బాధపడుతున్నానని, సైనస్ కూడా వచ్చిందని, అంతే కాకుండా ఇది పీరియడ్ సమయం అని కూడా చెప్పేసింది. అందుకే ఇలా అయిపోయింది పరిస్థితి వివరించసాగింది.

ప్రస్తుతం శ్రుతీ హాసన్ సీనియర్ హీరోల సరసన నటించేస్తోంది. చిరంజీవి, బాలయ్య వంటి వారి పక్కన నటించేస్తోంది. ఇక ప్రభాస్ సలార్ సినిమాలోనూ హీరోయిన్‌గానూ చేస్తోంది. కానీ శ్రుతీ హాసన్‌కు ఒకప్పుడున్న క్రేజ్ గానీ స్టార్డం గానీ ఇప్పుడు లేదు. తన ప్రియుడితో పీకల్లోతు ప్రేమలో ఉన్న సమయంలో మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ వాటిని పక్కన పెట్టేసింది. ఇక ఆ ప్రియుడు తనకు సరైన వాడు కాదని, అతడ్ని వదిలించుకుంది. ఆ తరువాత శంతనుతో ప్రేమలో పడింది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

శంతనుతో ప్రేమలో ఉన్న సమయంలోనే సినిమాల మీద సైతం ఫోకస్ పెట్టింది. కానీ ఆమెకు అంతగా ఆఫర్లు రావడం లేదు. విజయ్ సేతుపతితో చేసిన లాభం సినిమా లాభం లేకుండా పోయింది. అలా శ్రుతి హాసన్‌కు కోలీవుడ్‌లో అవకాశాలు తక్కువ అయ్యాయి. కానీ తెలుగులో మాత్రం ఇలా సీనియర్ హీరోల సరసన చాన్స్ వచ్చింది.

రవితేజ క్రాక్ సినిమాతో శ్రుతి హాసన్‌కు హిట్ వచ్చింది. అలా తెలుగులో మళ్లీ శ్రుతీ హాసన్ సందడి చేస్తోంది. కానీ ఇప్పుడు చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీర సింహారెడ్డి సినిమాలు శ్రుతీ హాసన్‌ ఫేట్‌ను మార్చేస్తాయి. ఇవి హిట్ అయితే.. శ్రుతీ హాసన్ కెరీర్‌కు ఢోకా లేనట్టే.

Also Read : Dil Raju Varisu : 75 ఏళ్ల చరిత్రలో ఇలా జరగలేదు.. 'వారసుడు' వివాదంపై దిల్ రాజు కౌంటర్లు

Also Read : Ali Daughter Fatima Marriage : కమెడియన్ అలీ కూతురు వివాహాం.. చిరు, రోజా, నాగ్ సందడి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News