Ramadan 2023 Date & Fasting Timings in India: ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అత్యంత పవిత్రమైంది రంజాన్ నెల. ఈ నెలంతా కఠిన ఉపవాస దీక్షలు ఆచరించి ఆ తరువాత ఈదుల్ ఫిత్ర్ పండుగ జరుపుకుంటారు. రంజాన్ ఉపవాస దీక్షలు ఎప్పట్నించి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయో పరిశీలిద్దాం.
రంజాన్ నెల ప్రారంభౌతోంది. చంద్రమానం ప్రకారం ఇస్లామిక్ క్యాలెండర్ ఉండటంతో రంజాన్ ప్రారంభ తేదీ విషయంలో ఎప్పుడూ సందిగ్దత ఉండనే ఉంటుంది. అరబిక్ క్యాలెండర్ ప్రకారం అరబ్ దేశాల్లో షాబాన్ నెలలో ఇవాళ 29వ రోజు. ఈ ఏడాది షాబాన్ నెల 29 రోజులే ఉంటే ఇవాళే చంద్ర దర్శనం ఉంటుంది. ఇండియాలో కూడా మార్చ్ 21 వ తేదీ అంటే ఇవాళ చంద్ర దర్శనమైతే 22 నుంచి ఉపవాసాలు ప్రారంభమౌతాయని కొందరు వాదిస్తున్నా.. మెజార్టీ మాత్రం రేపే చంద్ర దర్శనమంటున్నారు. అంటే రేపు చంద్రుని దర్శనమైతే ఇండియాలో ఉపవాస దీక్షలు 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో అసలు ఇండియాలో చంద్ర దర్శనం ఎప్పుడుంటుంది, ఎప్పటి నుంచి రంజాన్ ప్రారంభం కానుందనేది తెలుసుకుందాం. సౌదీ అరేబియా సహా అరబ్ దేశాల్లో రంజాన్ నెలవంక దర్శనం మార్చ్ 21 అంటే ఇవాళ సాంత్రం ఉంది. చంద్ర దర్శనమైతే రేపట్నించి ఉపవాసాలు ప్రారంభం కానున్నాయి.
యూఏఈలో మార్చ్ 21 సాయంత్రం మగ్రిబ్ నమాజ్ అనంతరం నెలవంక దర్శనం ఉంటుంది. అందరూ ఇవాళ చంద్రుని కోసం చూస్తారు. అక్కడి మూన్ కమిటీ అబుదాబిలోని జస్టిస్ కాంప్లెక్స్‌లో చంద్ర దర్శనం చేస్తుంది. ఆ తరువాత మొదటి ఉపవాసం బుధవారం అంటే మార్చ్ 22న ఉంటారు. ఇవాళ సాయంత్రం చంద్ర దర్శనం చేయాలని సౌదీ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. మూన్ కమిటీలు ఇవాళ చంద్రుని చూసి..సమీపంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం సమర్పించాలి.
వాస్తవానికి అరబిక్ క్యాలెండర్ ప్రకారం అరబ్ దేశాల్లో షాబాన్ నెల ఇవాళ 29వ రోజు. ఒకవేళ షాబాన్ నెల 29 రోజులే ఉంటే ఇవాళ చంద్ర దర్శనం ఉంటుంది. ఒకవేళ ఈ నెల 30 రోజులదైతే చంద్ర దర్శనం రేపు అంటే మార్చ్ 22న ఉంటుంది.
ఇండియాలో చంద్ర దర్శనం ఎప్పుడు..?
అరబ్ దేశాల్లో చంద్ర దర్శనం రేపే ఉంటుందని చాలామంది విశ్వసిస్తున్నారు. ఆలా జరిగితే ఉపవాసాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇండియా విషయం పరిశీలిస్తే..మార్చ్ 22వ తేదీ అంటే రేపు చంద్ర దర్శనమయ్యేందుకు పూర్తి అవకాశాలున్నాయి. అదే జరిగితే ఇండియాలో కూడా గురువారం నుంచే ఉపవాసాలు ప్రారంభం కావచ్చు. సాధారణంగా అరబ్ దేశాల్లో రంజాన్ ప్రారంభ తేదీకు ఒకరోజు తరువాత ఇండియాలో రంజాన్ ప్రారంభమౌతుంటుంది. ఈసారి ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.
Also Read: Delhi Liquor Scam Case: ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట ఇద్దరినీ విచారించనున్న ఈడీ
Also Read: Ramadan 2023: రంజాన్ ఉపవాసాల్లో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎవరికి మినహాయింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook