Rasi Phalalu Today: ఫిబ్రవరి 7 నుంచి 8 తేది వరకు రాశి ఫలాలు.. ఈ రాశుల వారి ప్రయత్నాలు ఫలించబోతున్నాయి!

Rasi Phalalu Today Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు ఎంతో ప్రత్యేకమైనది ముఖ్యంగా ఈరోజు వజ్ర సిద్ధి ఏర్పడుతుంది దీని కారణంగా కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటే మరికొన్ని రాశిలో వారికి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.  అయితే ఏ ఏయే రాశుల వారికి ఎలా ఈరోజు ఎలా ఉంటుందంటే..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Feb 7, 2024, 08:12 AM IST
Rasi Phalalu Today: ఫిబ్రవరి 7 నుంచి 8 తేది వరకు రాశి ఫలాలు.. ఈ రాశుల వారి ప్రయత్నాలు ఫలించబోతున్నాయి!

Rasi Phalalu Today Telugu: హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్యమాసం హేమంత రుతువు ఉత్తరాయణం ఫిబ్రవరి 7వ తేదీ. ఈరోజు తెల్లవారి జామున వరకు పూర్వాషాడ నక్షత్రం ఉండగా రాత్రి 1 వరకు వజ్ర సిద్ది యోగం ఏర్పడుతుంది. ఇక ఈరోజు శుభ సమయం విషయానికి వస్తే ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుంది. అయితే ఈరోజు ఏర్పడే ప్రత్యేక యోగం కారణంగా మొత్తం 12 రాశులు ప్రభావితం అవుతాయి. ఈరోజు ఏయే రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి:
ప్రేమ జీవితం గడుపుతున్న వారికి ఈ సమయంలో ఒడిదుడుకు లేదురవుతాయి. ముఖ్యంగా కొంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఇక కుటుంబంలో ఎప్పటినుంచి ఉన్న ఆనందం కొనసాగుతూ వస్తుంది. కొత్త పనులు కూడా సులభంగా ప్రారంభిస్తారు. అంతే కాకుండా ఒత్తిడి ఆందోళన మిమ్మల్ని కొంత బాధ పెట్టొచ్చు.

వృషభ రాశి:
ఈ సమయంలో వృషభ రాశి వారు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీకు ఇష్టమైన వారితో అహంకారంతో మాట్లాడటం మానుకోవాలి. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయం గడుపుతారు. అంతేకాకుండా మీ భాగస్వామి మద్దతు లభించి ఈరోజు మంచి లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం చాలా కలిసి వస్తుంది.

మిథున రాశి:
మిధున రాశి వారికి కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. ముఖ్యంగా కెరీర్ కు సంబంధించిన శుభవార్తలు వింటారు. దీంతో పాటు నిలిచిపోయిన పనులను సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగాలు చేస్తున్నవారు బదిలీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు వీరు ప్రయాణాలు కూడా చేయవచ్చు. ఇక ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి కూడా ఈరోజు చాలా బాగుంటుంది. వీరికి ఈ సమయంలో కొత్త ఆదాయ వనరు లభిస్తాయి. దీంతో పాటు కష్టపడి పనులు చేసేవారు సవాళ్లను కూడా ఎదుర్కొంటారు. కాబట్టి ఈ సమయంలో ఒత్తిడి పెరగవచ్చు. అంతేకాకుండా ఆరోగ్యం పై ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి. ప్రభుత్వ రంగాల్లో పనులు చేస్తున్నవారు మంచి లాభాలు పొందుతారు.

సింహరాశి:
సింహ రాశి వారికి ఈ రోజు జీవిత భాగస్వామి సపోర్టు లభించింది. ఎంతో ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ సమయంలో కొంత ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా అదృష్టం పెరిగి పనుల్లో వస్తున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఆస్తుల విషయాలు అన్నదమ్ములతో వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కన్యారాశి:
కన్యా రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అంతే కాకుండా వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. ఈ సమయంలో తీసుకుని ప్రతి నిర్ణయం ఎంతో జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటు వీరు దూర ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. అలాగే మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

తులారాశి:
తులా రాశి వారికి ఈరోజు కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా బంధువుల సపోర్టు లభించి.. కొన్ని పనులు సులభంగా చేయగలుగుతారు. అయితే ఈ సమయంలో వీరు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాల్సింది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శరీరంపై ప్రత్యేక శ్రద్ధ వహించారు ఒత్తిడి వంటి సమస్యలకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఆ ఆర్థికంగా కొన్ని లాభాలు వస్తాయి. ముఖ్యంగా కెరీర్ కు సంబంధించి మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగాలు చేస్తున్నవారు ఆఫీసులో మంచి పేరు సంపాదిస్తారు. ప్రేమ, వైవాహిక జీవితం ఎంతో ఫలప్రదంగా ఉంటుంది కుటుంబ జీవితం గడుపుతున్న వారికి ఈరోజు కొంత గందరగోళంగా ఉంటుంది.

ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారికి ఈరోజు మిశ్రమ లాభాలు కలుగుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కష్టపడి పనిచేయడం వల్ల అఖండ విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా వ్యాపారాలు చేస్తున్న వారికి ఈరోజు లాభాలు కలుగుతాయి. అధికారులతో ఉన్న విభేదాలు కూడా తొలగిపోతాయి.

మకర రాశి:
ఈరోజు మకర రాశి వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ప్రయాణాలు చేయకుండా ఉండడం చాలా మంచిది. ప్రయాణాలు చేయడం వల్ల విపరీతమైన డబ్బు ఖర్చు అవుతుంది. అంతే కాకుండా అవసరమైన పనులు తొందరపడకుండా ఉండటం చాలా మంచిది. అధికారులతో విభేదాలు కూడా రావచ్చు. దీంతోపాటు కోరుకున్న పనులు జరగకపోవచ్చు.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

కుంభరాశి:
కుంభ రాశి వారికి ఈ రోజు ప్రేమ జీవితం మరింత బలపడుతుంది. ముఖ్యంగా వీరికి అన్ని పనులు చేయడానికి అనుకూలంగా ఉంటాయి. అయితే ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించారు. అంతే కాకుండా ఈరోజు ఎంతో ఓపికతో ఉండాలి ఆ కొత్త ఆదాయం అనరులు కూడా లభిస్తాయి. దీనికి కారణం ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది.

మీన రాశి:
మీన రాశి వారు ఈరోజు కొంత నిరాశ కలుగుతుంది. దీని కారణంగా కుటుంబంతో కలిసి ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయం కలిసి వస్తుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం. అలాగే మీరు కొత్త భూములను ఆస్తులను కూడా కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. అదనపు ఖర్చులు తగ్గించుకోవడం వల్ల వీరు మంచి ప్రయోజనాలు పొందుతారు.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News