shani effect october 2022 : శని దేవుడు ప్రయాణించే మార్గం ద్వారా అక్టోబర్ నెలలో కొంత మందికి శుభాలు కలుగుతాయట. ఐదు రాశుల వారికి శని చల్లని చూపు దక్కుతుందట. మేషం, కర్కాటక, మీనం, తులా, వృశ్చికం వంటి రాశుల వారికి అక్టోబర్ నెల కలిసి వస్తుందట. ఉద్యోగం, వ్యాపారం, వైవాహిక జీవితంలో మంచి జరుగుతుందట. సమస్యలన్నీ తీరిపోతాయట. ధనలాభం కూడా ఉందట.
మేషం : ప్రస్తుతం అక్టోబర్ నెలలో శని పయనించే మార్గాన్ని బట్టి చూస్తే.. మేష రాశి వారికి విజయాలు అందుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది. వ్యాపారం సైతం లాభసాటిగా ఉంటుంది. ఊహించిన మార్గంలో అకస్మాత్తుగా ఎక్కడి నుంచో డబ్బు వస్తుంది. తద్వారా గౌరవం కూడా పెరుగుతుంది. ఇంతకు ముందు విసిగించిన, ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి.
కర్కాటక రాశి : మామూలుగా అయితే శని దెబ్బకు కర్కాటక రాశి వారికి చుక్కలుకనిపించాలి. కానీ ప్రస్తుతం శని నడిచే మార్గం వల్ల వీరికి తమ తమ కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒత్తడి తగ్గుంది. ఉద్యోగ-వ్యాపారాలలోనూ ఉపశమనం కలుగుతుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.
తులారాశి : శనిగ్రహ ప్రత్యక్ష సంచారం వల్ల అక్టోబర్ నుండి తులారాశి వారికి మంచి శకునాలు ఎదురవుతాయి. సమస్యలను నుంచి ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి కారణం లేకుండా నిలిచిపోయిన పనులు వాటంతటవే పూర్తవుతాయి. సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం లభిస్తుంది.
వృశ్చిక రాశి : శని నడిచే మార్గం వల్ల ఈ రాశి వారికి ఇంటి వాహనా విషయంలో సంతోషం కలుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. పాత విషయాలు తేల్చుకోవచ్చు. ఖర్చు చేస్తారు కానీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
మీన రాశి : మీనరాశి వారికి అక్టోబర్ నెలలో శని మార్గం కావడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ప్రమోషన్లు, డబ్బులు పొందుతారు.
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు
Also Read : నాకు మొగుడిని వెతికినందుకు థాంక్స్.. ఇంకా ఆ విషయాలు కూడా చెప్పండి: అనన్య నాగళ్ల
Also Read : నీటిలోంచి యాభై అడుగుల పోస్టర్.. అయోధ్యలో ఆదిపురుష్ హంగామా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook