Shani Remedies: శనివారం నాడు ఈ 5 పరిహారాలు చేస్తే... ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు!

Shani Remedies: శనివారం నాడు శనిదేవుడికి కొన్ని పరిహారాలు చేయడం ద్వారా మీ జీవితంలో దేనికీ లోటు ఉండదు. ఆ పరిహారాలేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 2, 2022, 01:03 PM IST
  • శనివారం శనిదేవుడిని పూజించండి
  • ఈ పరిహారాలు చేయండి చాలు
Shani Remedies: శనివారం నాడు ఈ 5 పరిహారాలు చేస్తే... ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు!

Shani Dev Remedies: హిందూమతంలో వారంలోని ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది. శనివారం శనిదేవుడిని (Shani Dev) పూజిస్తారు. మనం చేసే పనులను బట్టి ఫలాలనిచ్చేవాడు శని. మంచి పనులు చేస్తే శుభఫలితాలు ఇస్తాడు, చెడు పనులకు పాల్పడితే అతడిని శిక్షిస్తాడు.  శనిదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు జ్యోతిష్య శాస్త్రంలో (Astrology) కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి. 

శని పరిహారాలు 
>> ఒక వ్యక్తి వ్యాపారంలో నిరంతర నష్టాలను ఎదుర్కొంటున్నట్లయితే లేదా కోర్టు కేసుల వల్ల ఇబ్బంది పడుతుంటే... శనివారం నాడు, 11 పీపుల్ ఆకుల హారాన్ని తయారు చేసి శని ఆలయానికి వెళ్లి శనిదేవుడికి సమర్పించండి. మీరు aమాల సమర్పించేటప్పుడు, 'ఓం శ్రీం హ్రీం షన్ శనిశ్చరాయ నమః' అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం వల్ల మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. 
>>  శనివారం నాడు మర్రిచెట్టు చుట్టూ 7 సార్లు దారాన్ని చుట్టి.. మీ మనస్సులో శనిదేవుడిని ధ్యానించినట్లయితే మీరు అనుకున్న పని జరుగుతుంది. 
>>  మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలంటే.. ప్రతి శనివారం కొన్ని నల్ల నువ్వులను రావి చెట్టుకు సమర్పించండి. అంతేకాకుండా రావి చెట్టుకు నీరు పోయండి. ఈ పరిహారంతో భార్యాభర్తల మధ్య అనుబంధం దృఢంగా ఉంటుంది. 
>>  మీరు జాబ్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే... శనివారం నాడు బొగ్గును తీసుకుని పారే నీటిలో విసిరేయండి. దీని వల్ల మీరు కోరుకున్న ఉద్యోగం వస్తుంది. 
>>  మీ ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం ఎల్లప్పుడూ ఉండాలంటే...  చక్కెర కలిపిన నీరును రావిచెట్టుకు సమర్పించండి. 

Also Read: Amarnath Yatra Secrets: అమరనాథ్ యాత్ర యెుక్క అంతుచిక్కని రహస్యాలు..!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News