Amarnath Yatra Secrets: అమరనాథ్ యాత్ర యెుక్క అంతుచిక్కని రహస్యాలు..!

Amarnath Yatra 2022: పవిత్రమైన అమరనాథ్ యాత్ర జూన్ 30 నుండి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అమరనాథ్ యెుక్క అంతుచిక్కని రహస్యాలు గురించి మీకు తెలియజేయబోతున్నాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 2, 2022, 12:14 PM IST
  • ప్రారంభమైన అమరనాథ్ యాత్ర
  • ఆగస్టు 31 వరకు కొనసాగనున్న యాత్ర
  • ఈ యాత్ర యెుక్క సీక్రెట్స్
Amarnath Yatra Secrets: అమరనాథ్ యాత్ర యెుక్క అంతుచిక్కని రహస్యాలు..!

Secrets Of Amarnath Yatra 2022: హిందూ మతంలో అమరనాథ్ యాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. జీవితంలో ఒక్కసారైనా ఈ యాత్ర చేయాలని ప్రతి హిందువు కోరుకుంటాడు.  జమ్మూకశ్మీర్ లోని అమరనాథ్ గుహలో మంచు రూపంలో కొలువైన మహాదేవుడిని దర్శించుకునేందుకు ఎముకలు కొరికే చలిలో ప్రాణాలకు తెగించి మరీ వెళ్తారు భక్తులు. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. ఈ సారి అమరనాథ్ యాత్ర (Amarnath Yatra 2022) జూన్ 30న ప్రారంభమై..ఆగస్ట్ 11 వరకు కొనసాగునుంది. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులు ఈ యాత్రకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. అమరనాథ్ యాత్రకు సంబంధించిన కొన్ని రహస్యాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

అమరనాథ్ రహస్యాలు: 
>> గ్రంథాల ప్రకారం, పరమశివుడు అమరనాథ్ గుహలోనే పార్వతి దేవికి 'అమరత్వం' యెుక్క మంత్రాన్ని వివరించాడు. 
>> శివుడు పార్వతిదేవికి అమరత్వం గురించి చెప్పే సమయంలో ఆ గుహలో ఉన్న రెండు పావురాలు ఆ మంత్రాన్ని విన్నాయి. ఈ జంట ఇప్పటికీ అమరనాథ్ గుహలో బతికే ఉన్నాయి. 
>> ఇక్కడ ఉన్న శేషనాగ్ సరస్సుపై శివుడు తన మెడలోని పాములను తొలగించాడు.
>> అమరనాథ్కు 96 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్గామ్‌లో శివుడు ఆగి విశ్రాంతి తీసుకున్నాడు. ఇక్కడ అతను తన వాహనమైన నందిని విడిచిపెట్టాడు.
>> అమరనాథ్ గుహకు వెళ్లే మార్గంలో పంచతర్ణిలో శివుడు పంచభూతాలను త్యజించాడు.
>> అమరనాథ్ గుహలోని శివలింగం దగ్గర నుండి నీరు ప్రవహిస్తుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. 
>> ఈ గుహ 5000 సంవత్సరాల పురాతనమైనది.  ఇక్కడ ఉన్న శివలింగాన్ని ‘స్వయంభూ లింగం’ అని కూడా అంటారు. 
 >>  శివుడు మూడో కన్ను తెరవడం వల్లే ఈ గుహ ఏర్పడిందని చరిత్రకారులు చెబుతుంటారు.

Also Read; అకాల మృత్యుబాధ తొలగిపోవాలన్నా, మోక్షం పొందాలన్నా.. ఈ మంత్రాన్ని జపించండి!! 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News