Shani Retrograde Effect 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ గ్రహం అయిన ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంది. ఇదిలా ఉండే శని గ్రహం అయితే రెండున్నరేళ్లకు ఒక సారి రాశి సంచారం చేస్తుంది. కానీ ఈ గ్రహం అప్పుడప్పుడు తిరోగమనం చేస్తుంది. ఈ గ్రహ సంచారానికి ఎలాంటి ప్రాముఖ్యత ఉంటుందో, తిరోగమనానికి కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. అయితే ఈ గ్రహం దాదాపు 30 సంవత్సరాల తర్వాత మూలత్రికోణ రాశిగా పరిగణించే కుంభ రాశిలో తిరోగమనం చేయబోతోంది. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం 15 నవంబర్ వరకు కుంభ రాశిలో ఉంటాడు. ఈ తిరోగమనం కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ తిరోగమన ప్రభావంతో కొన్ని రాశులవారికి దుష్ప్రభావాలు కలిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సమయం ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
షష రాజ్యయోగం:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని గ్రహానికి ఎంతో ఇష్టమైన కుంభ రాశితో పాటు మకర రాశుల్లో ఉన్నప్పుడు ఈ షష రాజ్యయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగానికి కూడా జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన ప్రముఖ్యత ఉంది. ఈ షష రాజ్యయోగంతో కొన్ని రాశులవారికి విపరీతమైన ఆర్థిక లాభాలు కలుగుతాయి.
శని తిరోగమనంతో లాభాలు పొందే రాశులు:
వృషభ రాశి:
శుక్రుడు అధిపతిగా వ్యవహరించే రాశుల్లో వృషభ రాశి ఒకటి. అయితే ఈ శని గ్రహానికి, శుక్ర గ్రహానికి మంచి సంబంధం ఉంటుంది. కాబట్టి శని తిరోగమనం కారణంగా వృషభ రాశివారికి మంచి జరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో మంచి ప్రయోజనాలు కలగడమే కాకుండా అసంపూర్ణంగా ఉన్న మొత్తం పనులు పూర్తవుతాయి. అంతేకాకుండా ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్స్ కూడా లభించే ఛాన్స్‌లు ఉన్నాయి. కుటుంబ జీవితంలో సంతోషం కూడా రెట్టింపు అవుతుంది.
కుంభ రాశి:
కుంభరాశి కూడా శని తిరోగమనం చాలా శుభఫ్రదంగా ఉంటుది. ఈ తిరోగమనం కారణంగా ఏర్పడే శష రాజయోగ ప్రభావం సమానంగా పడుతుంది. దీని కారణంగా పూర్తిగా ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా కష్టపడి పనులు చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో విజయాలు కూడా సాధిస్తారు. అలాగే వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు భారీ లాభాలు కూడా పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
వృశ్చిక రాశి:
ఈ తిరోగమనం కారణంగా ఏర్పడే రాజయోగంతో వృశ్చిక రాశివారికి కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి మానసిక సమస్యల నుంచి విముక్తి లభించడమే కాకుండా అనుకున్న పనులు కూడా సులభంగా జరుగుతాయి. దీంతో పాటు వీరు ప్రతి పనిలో అద్భుతమైన విజయాలు సాధించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతో పాటు వీరికి పాత పెట్టుబడుల నుంచి డబ్బులు కూడా వస్తాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి