Shirdi Sai Baba ekadasha sutramulu: గురువారం పేరెత్తగానే చాలామందికి ముందుగా గుర్తుకొచ్చేది ఆ షిర్డీ సాయి బాబానే. గురువారం అంటే సాయి బాబా భక్తులకు ఎంతో ప్రీతికరమైన రోజు. గురువారం నాడు ఆ షిర్డీ సాయిబాబాను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే తప్పకుండా ఆ సాయినాధుడి అనుగ్రహం లభిస్తుంది అనేది భక్తులకు ఉన్న బలమైన విశ్వాసం. అందుకే గురువారం నాడు సాయి బాబా ఆలయాలు భక్తజన సందోహంతో కిక్కిరిసిపోతుంటాయి.
గురువారం సాయిబాబాను పూజించే సమయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో సాయిబాబా ఏకాదశ సూత్రములను పఠిస్తే.. మనస్సుకు ప్రశాంతత చేకూరడంతో పాటు ఆ దేవుడి ఆశిస్తులు పొందవచ్చని గ్రంధాలు చెబుతున్నాయి.
సాయిబాబా ఏకాదశ సూత్రములు
( 1 ) షిర్డీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము.
( 2 ) ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశ మొనరించినంతనే సుఖసంపదలు పొందగలరు.
( 3 ) ఈ భౌతిక దేహానంతరము సైతం నేనప్రమత్తుడను.
( 4 ) నా భక్తులకు రక్షణంబు నా సమాధి నుండియే వెలువడును.
( 5 ) నా సమాదినుండియే నేను సర్వ కార్యములను నిర్వహింతును.
( 6 ) నా సమాధినుండియే నా మానుష్య శరీరము మాట్లాడును.
( 7 ) నన్నాశ్రయించిన వారిని, నన్ను శరణు జొచ్చిన వారిని నిరంతరం రక్షించుటయే నా కర్తవ్యము.
( 8 ) నాయందెవరికి ద్రుష్టిగలదో వారి యందే నా కటాక్షము గలదు.
( 9 ) మీ భారములను నాపై బడవేయుడు. నేను మోసెదను.
( 10 ) నా సహాయమును కానీ, నా సలహానుగాని, కోరిన తక్షణమే మొసంగ సంసిద్ధుడను.
( 11 ) నా భక్తుల ఇంట 'లేమి' అను శబ్దము పొడచూపదు.
అత్యంత భక్తి శ్రద్ధలతో సాయిబాబా ఏకాదశ సూత్రములు పఠిస్తూ ఆ సాయి నాధుడిని ప్రార్థిస్తే సాయి బాబా దృష్టి భక్తులపైపడి ఆయన కరుణ, కటాక్షాలు లభిస్తాయనేది భక్తుల నమ్మకం.