Shukra Dev: శుక్రుడికి ఎంతో ఇష్టమైన రాశులు ఇవే.. వీరు ఎల్లప్పుడు లగ్జరీ లైఫ్, డబ్బులతో ఎంజాయ్ చేస్తారు!

Shukra Dev Favourite Zodiac Sign: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుభగ్రహంగా పిలిచే శుక్రుడు సంచారం చేసిన ప్రతిసారి అన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారు ఎల్లప్పుడూ అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. శుక్రుడి సంచారం వల్ల అత్యధిక లాభాలు పొందబోయే రాశులు ఏవో తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Sep 7, 2024, 10:57 PM IST
Shukra Dev: శుక్రుడికి ఎంతో ఇష్టమైన రాశులు ఇవే.. వీరు ఎల్లప్పుడు లగ్జరీ లైఫ్, డబ్బులతో ఎంజాయ్ చేస్తారు!

 

Shukra Dev Favourite Zodiac Sign: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడిని రాక్షసులకు అధిపతిగా చెప్పుకుంటారు. అందుకే జన్మ నక్షత్రంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటే అనేక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది అలాగే డబ్బు ధనం ఊహించని స్థాయిలో లభిస్తుంది. ఈ గ్రహాన్ని శృంగారం, సంపద, లగ్జరీ లైఫ్ కు సూచికగా భావిస్తారు. అందుకే ఈ గ్రహం సంచారం చేసిన ప్రతిసారి కొన్ని రాశుల వారి వ్యక్తిగత జీవితాల్లో మార్పులు కనిపిస్తాయి. ఈ గ్రహాన్ని బృహస్పతి తర్వాత అత్యంత శుభప్రదమైన గ్రహంగా పిలుస్తారు. కాబట్టి శుక్ర గ్రహం సంచారం చేసిన తిరోగమనం చేసిన అన్ని రాశుల వారికి చాలా బాగుంటుంది. శుక్ర గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేయడానికి దాదాపు 23 రోజులపాటు సమయం పడుతుంది. ఈ సమయంలో శుక్ర గ్రహం జాతకంలోని ఉచ్చ స్థితిలో ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఎప్పుడు పొందలేనంత ధనాన్ని కూడా పొందుతారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు ఎంతగానో ఇష్టపడే కొన్ని రాశులు ఉన్నాయట. ఆ రాశుల వారు ఎవరో? ఇప్పుడు తెలుసుకోండి. 

వృషభ రాశి: 
శుక్రుడి సంచారం వృషభ రాశి వారికి ఎంతో అదృష్టకరంగా ఉంటుంది కాబట్టి ఈ గ్రహం సంచారం చేసిన ప్రతిసారి వృషభ రాశి వారికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం లభించి విలాసమైన జీవితాన్ని కూడా గడుపుతారు. అలాగే వీరికి జీవితంలో సుఖసంతోషాలు కూడా రెట్టింపు అవుతాయి. అలాగే వీరు ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేకమైన గుర్తింపును పొందే అద్భుతమైన శక్తిని పొందగలుగుతారు. దీంతోపాటు వ్యాపారాలు చేస్తున్న వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించి అన్నీ సక్సెస్ అవుతాయి దీంతో ఆర్థికంగా కూడా ఊహించని లాభాలు పొందుతారు.  అలాగే వీరు అస్సలు వయసు కంటే యవ్వనంగా కనిపించేందుకు ఆరోగ్యమైన చిట్కాలను కూడా తరచుగా ఫాలో అవుతారు. అంతేకాకుండా ఈ సమయంలో కొత్త దుస్తులు కూడా కొనుగోలు చేస్తారు. 

తులారాశి: 
శుక్రుడి సంచారం తులారాశి వారికి కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం లభించి తులా రాశి వారు అనుకోని లాభాలు కూడా పొందుతారు. అలాగే కెరీర్ పరంగా కూడా వీరు మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి నైపుణ్యం పెరిగి అద్భుతమైన వరవడితో ముందుకు నడుస్తారు. పనులు కూడా ఎంతో చక్కగా చేస్తూ రోజురోజు గుర్తింపు పొందుతారు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహంతో తెలివితేటలు పెరిగి వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు. వ్యాపారాల్లో కూడా మంచి మంచి నిర్ణయాలు తీసుకొని గొప్ప స్థానాలకు ఎదుగుతారు. 

మీన రాశి: 
శుక్రుడికి మీన రాశి అంటే కూడా ఎంతో ఇష్టమట. కాబట్టి శుక్రుడు సంచారం చేసిన ప్రతిసారి ఈ రాశి వారిపై కూడా ప్రత్యక్షమైన ప్రభావం పడుతుంది. దీని కారణంగా వీరు ఊహించని లాభాలు పొందగలుగుతారు. అంతేకాకుండా జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుండి ఎదుర్కొంటారు. దీంతోపాటు ఆరోగ్యపరంగా కూడా ఎంతో జాగ్రత్తగా ముందుకెళ్తారు. అంతేకాకుండా ఏవైనా నిర్ణయాలు తీసుకునే క్రమంలో కూడా పదిసార్లు ఆలోచిస్తారు. అలాగే మీన రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మానసిక శాంతి కూడా పెరుగుతుంది. దీంతోపాటు ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News